ePaper
More
    Homeబిజినెస్​SME IPOs | ఎస్‌ఎంఈ ఐపీవోల జోరు

    SME IPOs | ఎస్‌ఎంఈ ఐపీవోల జోరు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic stock market)లో లిస్టవడానికి ఎస్‌ఎంఈ(SME) కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఈ వారంలో మూడు కంపెనీలు ఇన్షియల్ పబ్లిక్‌ ఇష్యూ(IPO)కు వస్తున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందామా..

    SME IPOs | Victory Electric Vehicles IPO:

    ఇన్వెస్టర్ల నుంచి రూ.40.66 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో విక్టరీ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ఐపీవోకు వస్తోంది. పబ్లిక్‌ ఇష్యూలో 56.47 లక్షల తాజా షేర్లను జారీ చేయనుంది. మంగళవారం సబ్‌స్క్రిప్షన్‌ (Subscription) ప్రారంభమవుతుంది. 23తో ముగుస్తుంది. కంపెనీ ఒక్కో షేరు ధర రూ.72గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 1,600 షేర్లుంటాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు ఒక లాట్‌ కోసం రూ.1,15,200తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కంపెనీ షేర్లు 28న ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌ కానున్నాయి. కాగా.. గ్రే మార్కెట్‌ ప్రీమియం జీరోగా ఉంది.

    SME IPOs | Dar Credit IPO:

    రూ.25.66 కోట్లు సమీకరించాలన్న లక్షంతో డార్‌ క్రెడిట్‌ కంపెనీ ఐపీవోకు వస్తోంది. సబ్‌స్క్రిప్షన్‌ 21న ప్రారంభమవుతుంది. 23తో ముగుస్తుంది. కంపెనీ ధరల శ్రేణిని(Price band) రూ.57 నుంచి రూ.60గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 2 వేల షేర్లుంటాయి. ఒక లాట్‌ (Lot) కోసం 1.20 లక్షలతో బిడ్‌ దాఖలు చేయాలి. ఈ కంపెనీ షేర్లు 28న ఎన్‌ఎస్‌ఈ(NSE)లో లిస్ట్‌ అవుతాయి. జీఎంపీ(GMP) 20 శాతం ఉంది.

    SME IPOs | Unified Data- Tech IPO:

    పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా రూ.144.47 కోట్లు సమీకరించడం కోసం యూనిఫెడ్‌ డేటా-టెక్‌ ఐపీవోకు వస్తోంది. ఈ కంపెనీ సబ్‌స్క్రిప్షన్‌ 22న ప్రారంభమై 26న ముగియనుంది. ఈనెల 29న బీఎస్‌ఈ(BSE)లో లిస్ట్‌ అవుతుంది. ఒక లాట్‌లో 400 షేర్లుంటాయి. లాట్‌ కోసం రూ.1,09,200తో దరఖాస్తు చేసుకోవాలి. సంస్థ ధరల శ్రేణిని రూ.260 నుంచి రూ.273గా నిర్ణయించింది. ప్రస్తుతం గ్రే మార్కెట్‌ ప్రీమియం(Grey market premium) 64 శాతంగా ఉంది.

    More like this

    Health Tips | వంటింట్లో ఆరోగ్యం .. ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Health Tips | జ్ఞాపకశక్తిని పెంపొందించడం, మనస్సును పదునుగా ఉంచేవి ఎన్నో మన వంట...

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...