ePaper
More
    HomeతెలంగాణSri Ram Sagar | శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​కు స్వల్ప ఇన్​ఫ్లో

    Sri Ram Sagar | శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​కు స్వల్ప ఇన్​ఫ్లో

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Sri Ram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్ ​(Sri Ram Sagar Project)కు స్వల్ప ఇన్​ఫ్లో వస్తోంది. బాబ్లీ ప్రాజెక్ట్ (Babli Project) గేట్లు ఎత్తడంతో ఎగువ నుంచి స్థానికంగా కురిసిన వర్షాలతో జలాశయంలోకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్​లోకి 6,090 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది.

    ప్రాజెక్ట్​ నుంచి కాకతీయ ప్రధాన కాలువకు 100 క్యూసెక్కులు, మిషన్​ భగీరథ(Mission Bhagiratha) కోసం 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆవిరి రూపంలో 323 క్యూసెక్కులు పోతోంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా.. ఆదివారం ఉదయానికి జలాశయంలో 1066.80 అడుగుల(18.443 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయంలో ప్రాజెక్ట్​లో 11.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం నీటి నిల్వ ఎక్కువగా ఉంది. అలాగే మహారాష్ట్రలో వర్షాలు పడుతుండడంతో రైతులు(Farmers) హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ ఏడాది జూన్​ 1 నుంచి ప్రాజెక్ట్​లోకి 7.59 టీఎంసీల నీరు వచ్చింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...