Homeబిజినెస్​Today Gold Price | స్వల్పంగా తగ్గిన బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు ఎంత ఉన్నాయంటే..

Today Gold Price | స్వల్పంగా తగ్గిన బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు ఎంత ఉన్నాయంటే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : దేశంలో బంగారం ధరలు (Gold rates) స్వల్పంగా తగ్గినప్పటికీ, ఇంకా ఆల్‌ టైమ్‌ రికార్డుస్థాయిలోనే కొనసాగుతున్నాయి. తులం బంగారం కొనాలంటే లక్ష రూపాయల వరకు ఖర్చవుతోంది.

జులై 28వ తేదీ నాటికి 24 క్యారెట్ల (24-carat gold) 10 గ్రాముల బంగారం ధర రూ.99,920గా నమోదవ్వగా, అదే 22 క్యారెట్ల బంగారం (22-carat gold) ధర రూ.91,590గా ట్రేడ్ అయింది. ధరలు కొంత తగ్గినా, సాధారణ వినియోగదారులను మాత్రం ఈ రేట్లు ఆందోళనకు గురి చేస్తూనే ఉన్నాయి. ఇంత రేట్లు పెట్టి ఎలా కొనేద‌ని మొత్తుకుంటున్నారు.

ఇక ఇదే సమయంలో వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర సగటున రూ.1,15,900గా ఉంది. కొన్ని నగరాల్లో వెండి ధర రూ.1,25,900 వరకు కొనసాగుతోంది.

Today Gold Price : స్వ‌ల్పంగా త‌గ్గుద‌ల‌..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..

  • చెన్నైలో 24 క్యారెట్లు – రూ. 99,920, 22 క్యారెట్లు – రూ. 91,590
  • ఢిల్లీలో 24 క్యారెట్లు – రూ. 99,920, 22 క్యారెట్లు – రూ. 91,590
  • హైదరాబాద్ లో 24 క్యారెట్లు – రూ. 99,920, 22 క్యారెట్లు – రూ. 91,590
  • విజయవాడ Vijaywada 24 క్యారెట్లు – రూ. 99,920, 22 క్యారెట్లు – రూ. 91,590,
  • బెంగళూరులో 24 క్యారెట్లు – రూ. 99,920, 22 క్యారెట్లు – రూ. 91,590గా న‌మోదైంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల(international stock markets)లో నెలకొన్న అస్థిరత, భద్రతా పెట్టుబడిగా బంగారంపై పెరిగిన ఆసక్తి, డాలర్ మారకపు మార్పులు ఇవన్నీ కలిసి బంగారం ధరలు పెర‌గ‌డానికి కార‌ణం అవుతున్నాయి.

నిపుణులు సూచించేది ఏమిటంటే.. ఈ సమయంలో బంగారు ఆభరణాలు కొనేటప్పుడు నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడవద్దని స్పష్టం చేస్తున్నారు. చిన్న పొరపాటు వల్లనే పెద్ద మొత్తంలో నష్టం కలగవచ్చు. BIS హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలనే ఎంపిక చేసుకోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు.

బంగారం ధరలు కొంత‌ వరకు తగ్గినా, సాధారణ మధ్యతరగతి కుటుంబానికి Middle Class Family ఇది ఇప్పటికీ భారమే. అయితే సంప్రదాయ పరంగా శుభకార్యాల కోసం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటే, నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ జాగ్రత్తగా కొనుగోలు చేయడం అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.