Registration | పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్​.. రేపటి నుంచి అమల్లోకి..

అక్షరటుడే, వెబ్​డెస్క్: Registration | ప్రస్తుతం ఏదైనా ఆస్తి రిజిస్ట్రేషన్​ కోసం సబ్​ రిజిస్ట్రార్(Sub Registrar) కార్యాలయాలకు వెళ్తే రోజంతా పడిగాపులు కాయాలి. ముఖ్యంగా జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో ఉన్న సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీసుల్లో రద్దీ అధికంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. ఒక్కో రోజు కార్యాలయాలకు భారీగా ప్రజలు వస్తుండడంతో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ఆలస్యం అవుతోంది. ప్రజల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్​ ప్రక్రియను సులభతరం చేయాలని సంకల్పించింది. అందులో భాగంగా స్లాట్ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Registration | ప్రస్తుతం ఏదైనా ఆస్తి రిజిస్ట్రేషన్​ కోసం సబ్​ రిజిస్ట్రార్(Sub Registrar) కార్యాలయాలకు వెళ్తే రోజంతా పడిగాపులు కాయాలి. ముఖ్యంగా జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో ఉన్న సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీసుల్లో రద్దీ అధికంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. ఒక్కో రోజు కార్యాలయాలకు భారీగా ప్రజలు వస్తుండడంతో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ఆలస్యం అవుతోంది.

ప్రజల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్​ ప్రక్రియను సులభతరం చేయాలని సంకల్పించింది. అందులో భాగంగా స్లాట్ బుకింగ్​(Slot Booking) విధానం అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే 22 సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీసుల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది. అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్​రిజిస్ట్రార్​ ఆఫీసుల్లో స్లాట్​ బుకింగ్​ విధానం జూన్​ 2 (సోమవారం) నుంచి అమలులోకి తీసుకురానుంది.

Registration | అక్కడ విజయవంతం కావడంతో..

ప్రస్తుతం రాష్ట్రంలో 144 సబ్​ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉన్నాయి. మొదట 22 కార్యాలయాల్లో ఏప్రిల్​ 10 నుంచి స్లాట్​ బుకింగ్​ విధానం ప్రవేశ పెట్టారు. అక్కడ విజయవంతం కావడంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా స్లాట్​ బుకింగ్​ విధానాన్ని తీసుకు రానుంది.

Registration | సులభంగా ప్రక్రియ

ఒకే సమయంలో ఎక్కువ డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్‌ కోసం సమర్పించడంతో జరిగే ఆలస్యాన్ని నివారించడానికి సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లోని (sub registrar office) పనివేళలను 48 స్లాట్‌లుగా విభజించారు. ప్రజలు ఆన్​లైన్​లో స్లాట్​ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్​కు వెళ్లాల్సి ఉంటుంది. తమకు నచ్చిన సమయాన్ని రిజిస్ట్రేషన్​ కోసం ఎంపిక చేసుకోవచ్చు. ఆ సమయానికి వస్తే అధికారులు ప్రక్రియ పూర్తి చేస్తారు. కాగా ఇప్పటి వరకు 45,191 డాక్యుమెంట్లు స్లాట్‌ బుకింగ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేశారు.

Registration | వాట్సాప్​లో సేవలు

రిజిస్ట్రేషన్​ కోసం వచ్చే ప్రజలకు వాట్సాప్​లో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏఐ ఆధారిత వాట్సాప్‌ చాట్‌బాట్‌ మేధ ప్రారంభం ప్రారంభించనుంది. రిజిస్ట్రేషన్​కు సంబంధించిన ఏమైనా సందేహాలుంటే వాట్సాప్​లోనే నివృత్తి చేసుకోవచ్చు. మరింత వేగవంతంగా, పారదర్శకంగా రిజిస్ట్రేషన్‌ సేవలే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.

Related articles

February 23 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

February 23 Panchangam | తేదీ (DATE) – ఫిబ్రవరి 23,​ 2026 పంచాంగం (today horoscope) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం.. హార్వర్డ్​లో ప్రసంగించే అవకాశం!

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ...

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...