Sriramsagar Project
Sri Ram Sagar | శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​కు స్వల్ప ఇన్​ఫ్లో

అక్షరటుడే,ఆర్మూర్: Sriramsagar Project | రెండుమూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప ఇన్​ఫ్లో (Inflow of Sriram Sagar) వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్ట్​లో 12.672 టీఎంసీల నీరు ఉంది.

గతేడాది ఇదే సమయానికి 7.410 టీఎంసీలుగా ఉంది. 15రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో నిజామాబాద్ (Nizamabad), నిర్మల్ (Nirmal) జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్ట్​లోకి 2,315 స్వల్ప ఇన్​ఫ్లో వచ్చి చేరుతోంది.

ఆవిరి రూపంలో 341 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గతేడాది యాసంగికి ప్రాజెక్టు పరిధిలోని 6 లక్షల ఎకరాలకు 62 టీఎంసీల నీటిని అందించారు. ఈ ఏడాది సైతం ప్రాజెక్ట్​లోకి 60టీఎంసీల నీటీనిల్వ అనంతరం ఖరీఫ్​కు నీటి విడుదలపై అధికారులు సమాలోచన చేయనున్నారు.