Homeజిల్లాలునిజామాబాద్​Sriramsagar Project | ఎస్సారెస్పీకి స్వల్ప ఇన్​ఫ్లో

Sriramsagar Project | ఎస్సారెస్పీకి స్వల్ప ఇన్​ఫ్లో

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Sriramsagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా ఇన్​ఫ్లో వచ్చి చేరుతోంది. ఎగువన కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి 2,054 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. కాగా.. ఆవిరి రూపంలో 268 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు (Mission Bhagiratha) 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 14.103 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి 8.343 టీఎంసీలుగా ఉంది.

గతేడాది యాసంగికి 6 లక్షల ఎకరాలకు 62 టీఎంసీల నీటిని అందించగా, ఈసారి సైతం ప్రాజెక్టులో 60 టీఎంసీల నీరు నిండిన అనంతరం ఖరీఫ్ పంటలకు సాగు నీటి విడుదల విషయమై ప్రాజెక్టు అధికారులు ప్రణాళికలు రూపొందించనున్నారు.