Homeటెక్నాలజీSkype | స్కైప్‌ కథ కంచికి.. నేటితో నిలిచిపోనున్న సేవలు

Skype | స్కైప్‌ కథ కంచికి.. నేటితో నిలిచిపోనున్న సేవలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Skype | దాదాపు రెండు దశాబ్దాల (Two decades) పాటు వీడియో కాన్ఫరెన్సింగ్‌ ఫ్లాట్‌ఫాంగా నిలిచిన మైక్రోసాఫ్ట్‌కు చెందిన స్కైప్‌ Skype కథ కంచికి చేరింది. ప్రజాదరణ తగ్గడంతో సోమవారం (Monday) నుంచి సేవలు నిలిచిపోనున్నాయి. దీనికి బదులుగా మైక్రోసాఫ్ట్‌ (MIcrosoft) సంస్థకే చెందిన టీమ్స్‌ను teems వినియోగించుకోవాలని ఆ సంస్థ ప్రకటించింది.

స్కైప్‌ (Skype) 2003లో ప్రారంభమైంది. వీడియో కాలింగ్‌ రంగంలో బాగా ప్రాచుర్యం పొందిన దీనిని మైక్రోసాఫ్ట్‌ సంస్థ 2011లో టేకోవర్‌ చేసింది. జూమ్‌ (Zoom), వాట్సాప్‌ కాలింగ్‌ సౌకర్యాలు లేకముందు వీడియో కాలింగ్‌ కోసం, కాన్ఫరెన్స్‌ల కోసం స్కైప్‌నే (Skype) వినియోగించేవారు. వ్యాపార సంస్థలు, ఉద్యోగులు వీడియో కాన్ఫరెన్స్‌ కోసం స్కైప్‌ను ఉపయోగించుకునేవారు. విదేశాల్లో ఉన్నవారు తక్కువ ఖర్చుతో తమ బంధుమిత్రులతో మాట్లాడడానికి ఈ ఫ్లాట్‌ఫాంను వినియోగించేవారు. అయితే కరోనా కాలంలో దీనికి పోటీ పెరిగింది. జూమ్‌, గూగుల్‌ మీట్‌ (Google meet) వంటివి మెరుగైన ఫీచర్లను తీసుకురావడం, వాట్సాప్‌ (Whatsapp) కూడా పోటీ ఇవ్వడంతో స్కైప్‌కు ఆదరణ తగ్గింది.

అంతేకాకుండా మైక్రోసాఫ్ట్‌ (MIcrosoft) లాంచ్‌ చేసిన టీమ్స్‌ కూడా దీనికి అంతర్గత పోటీదారుగా మారింది. కోవిడ్‌ (Covid) సమయంలో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో స్కైప్‌ విఫలమవడం, దానిని జూమ్‌ ఒడిసిపట్టుకోవడంతో క్రమంగా యూజర్లు (Users) చేజారిపోయారు. మైక్రోసాఫ్ట్‌ సంస్థ టీమ్స్‌పై ఎక్కువ దృష్టి సారించి, స్కైప్‌ను (Skype) నిర్లక్ష్యం చేయడం కూడా దీని పతనానికి ఓ కారణం.

2008లో 400 మిలియన్‌ యూజర్లను కలిగి ఉన్న ఈ ఫ్లాట్‌ఫాం.. 2025 నాటికి 23 మిలియన్‌ యూజర్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి దీనిని నిలిపివేయాలని మైక్రోసాఫ్ట్‌ నిర్ణయించింది. కాగా ప్రస్తుత యూజర్లకు వారి బిల్లింగ్‌ సైకిల్‌ ముగిసే వరకు సేవలు కొనసాగుతాయని పేర్కొంది. లేదా టీమ్స్‌(Teams)కు మారాలని సూచించింది.