అక్షరటుడే, ఇందూరు: Youth Skills Day | నిజామాబాద్ నగరంలోని బోర్గాం(పి) ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం స్కిల్స్డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
Youth Skills Day | ఒకేషనల్ కోర్సులకు ఆదరణ..
ఈ సందర్భంగా హెడ్మాస్టర్ శంకర్ మాట్లాడుతూ బోర్గాం(పి) పాఠశాలలో (Borgam(P) School) వొకేషనల్ కోర్సులు(Vocational courses) సైతం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటికి ఎంతో ఆదరణ ఉందన్నారు. ఎలక్ట్రానిక్స్ (electronics courses), బ్యూటీషియన్ కోర్సుల్లో (beautician courses) శిక్షణ ఇస్తున్నామని వివరించారు. అంతేకాకుండా శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫకెట్లు కూడా అందిస్తామన్నారు. ఇవి భవిష్యత్తులో ఉపయోగపడతాయని వివరించారు. కార్యక్రమంలో వొకేషనల్ ఉపాధ్యాయులు సోని, పవిత్ర తదితరులు పాల్గొన్నారు.

