అక్షరటుడే, వెబ్‌డెస్క్: Skill development | మీ నైపుణ్యాలను పెంచుకునేందుకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా యువత తనని తాను తీర్చిదిద్దుకోవాలని కేంద్ర ప్రభుత్వం (central government) కృషి చేస్తోంది.
దీనిలో భాగంగా, ప్రతిభావంతులైన యువతను గుర్తించి, ప్రోత్సహించడానికి స్కిల్ ఇండియా కాంపిటీషన్-2025ను (Skill India Competition-2025) ప్రకటించింది. ఈ పోటీల కోసం వివిధ స్కిల్ ట్రేడ్‌లలో ఆసక్తి ఉన్న ఔత్సాహిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
Skill development | పోటీలో పాల్గొనే అవకాశం:
నమోదు చేసుకున్న అభ్యర్థులు జిల్లా స్థాయి నుంచి ప్రారంభించి, రాష్ట్ర, జాతీయ, చివరికి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది.
Skill development | ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయి?
యువత డిమాండ్‌కు అనుగుణంగా వందలాది కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి:
కోడింగ్, కృత్రిమ మేధ (Artificial Intelligence), డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్, హెల్త్ కేర్, అగ్రికల్చర్, కమ్యూనికేషన్, లీడర్‌షిప్ వంటి కోర్సులు ఉన్నాయి.
Skill development | కోర్సుల విధానం:
కోర్సుల ఆధారంగా మైక్రో ప్రోగ్రామ్‌లు (కొన్ని గంటలు) లేదా కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్‌లు (కొన్ని వారాలు/నెలలు) ఉంటాయి. వీడియో క్లాసులు, చర్చా కార్యక్రమాలు, క్విజ్ పోటీలు, ప్రాక్టికల్ అసైన్‌మెంట్స్ వంటివి శిక్షణలో భాగం. చాలా కోర్సులు ఉచితంగా లభిస్తున్నాయి. ఈ కోర్సుల ద్వారా సరికొత్త నైపుణ్యాలను నేర్చుకుని, భవిష్యత్తుకు మార్గం సుగమం చేసుకోవచ్చు.
Skill development | ఎక్కడ దరఖాస్తు చేయాలి?
- ఆసక్తిగల వారు skillindiadigital.gov.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- నమోదు ప్రక్రియ : ముందుగా, వెబ్‌సైట్‌లో ఫోన్ నంబరు ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
- తరువాత, ఏ రంగంలో నైపుణ్యం పెంచుకోవాలనుకుంటున్నారో ఎంపిక చేసుకోవాలి.
- అనంతరం వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి.
- చివరగా, చిరునామా, విద్యార్హతలు, ఉద్యోగం వివరాలు వంటివి పొందుపరచాలి.