అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad City | మద్యం తాగి (drunk driving) వాహనాలు నడుపుతున్న వారికి పోలీసులు షాక్ ఇస్తున్నారు. నిత్యం తనిఖీలు చేపడుతూ వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ఆరుగురికి కోర్టు జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ (Traffic CI Prasad) తెలిపారు. మరో 14 మందికి భారీ జరిమానా విధించినట్లు వివరించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 20 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali) ఆదేశాల మేరకు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జాన్ ఎదుట హాజరు పరిచినట్లు ఆయన తెలిపారు. కోర్టు ఆరుగురికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధించింది. మరో 14 మంది నిందితులకు మొత్తం రూ.1,41,000 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.
