Homeజిల్లాలుకామారెడ్డిDrunk driving | మద్యం మత్తులో డ్రైవింగ్​.. ఆరుగురికి జైలు

Drunk driving | మద్యం మత్తులో డ్రైవింగ్​.. ఆరుగురికి జైలు

మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. డ్రంకన్​ డ్రైవ్​లో పట్టుబడ్డ 50 మందికి కోర్టు జరిమానాలు విధించింది.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Drunk driving | డ్రంకన్​ డ్రైవ్ కేసులు (Drunk and driving cases) రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన వారికి కోర్టు జరిమానాలు, జైలుశిక్షలు విధిస్తోంది. అయినప్పటికీ మందుబాబుల్లో మార్పు రావట్లేదు. దర్జాగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారు. డ్రంకన్​ డ్రైవ్​లో పట్టుబడిన 50 మందికి న్యాయస్థానం సోమవారం జరిమానాలు విధించింది.

ఇందులో కామారెడ్డి (Kamareddy), దేవునిపల్లి, తాడ్వాయి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆరుగురికి రూ.1,000 జరిమానాతో పాటు ఒకరోజు జైలుశిక్ష విధించింది. మాచారెడ్డి, సదాశివనగర్, భిక్కనూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో 44 మందికి రూ.1,000 చొప్పున రూ.44 వేల జరిమానా వేసింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) మాట్లాడుతూ.. మద్యం తాగి డ్రైవ్ చేస్తే జైలుశిక్ష, జరిమానా తప్పదన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు.

Must Read
Related News