అక్షరటుడే, లింగంపేట: Lingampet | తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ఎల్లారెడ్డి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సుష్మ గురువారం తీర్పు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. నాగిరెడ్డిపేట మండలంలోని (Nagireddypet mandal) మాల్తుమ్మెదకు చెందిన సిద్దగారి పర్వయ్య వ్యవసాయ భూమి (agricultural land) అమ్మగా వచ్చిన రూ.1.40 లక్షలు ఇంట్లోని బీరువాలో భద్రపరిచాడు.
తన అత్తగారి ఆరోగ్యం బాగా లేకపోవడంతో 2020 సెప్టెంబర్ 22న అత్తగారింటికి వెళ్లి తిరిగి 24న ఇంటికి వచ్చాడు. కాగా.. ఇంటి తాళం పగులగొట్టి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో నగదు కనిపించలేదు. దీంతో 25న పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా బాధితుడి ఇంటి పక్కనే ఉన్న పాత నేరస్తుడు పట్నం సాయిలును నిందితుడు గుర్తించారు. సాక్ష్యాధారాలతో కోర్టులో ప్రవేశపెట్టగా.. నేరం రుజువు కావడంతో జడ్జి నిందితుడికి గురువారం శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.

