ePaper
More
    HomeతెలంగాణPhone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో సిట్​ దూకుడు.. మరోసారి విచారణకు ప్రభాకర్​రావు

    Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో సిట్​ దూకుడు.. మరోసారి విచారణకు ప్రభాకర్​రావు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో సిట్​ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్​రావు(Prabhakar Rao)ను ఇప్పటికే పలుమార్లు అధికారులు విచారించారు. మంగళవారం సైతం ఆయనను విచారించిన సిట్​.. బుధవారం సైతం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో నేడు మరోసారి ఆయనను అధికారులు ప్రశ్నించనున్నారు.

    Phone Tapping Case | ఫోన్​ స్వాధీనం

    బీఆర్​ఎస్​ హయాంలో ఎస్​ఐబీ చీఫ్​గా వ్యవహరించిన ప్రభాకర్​రావు తన టీమ్​తో కలిసి ప్రతిపక్ష నాయకులతో పాటు జడ్జీలు, సినీ ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్​(Phone Tapping Case) చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో దీనిపై కేసు నమోదైంది. కేసు నమోదు కావడంతో అమెరికా పారిపోయిన ప్రభాకర్​రావు గత నెలలో తిరిగి వచ్చారు. అప్పటి నుంచి అధికారులు ఆయనను పలుమార్లు విచారణకు పిలిచారు. ఇందులో భాగంగా ప్రభాకర్​ ఫోన్​ను అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.

    అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) సమయంలో ప్రభాకర్​రావు మూడు ఫోన్లు వినియోగించినట్లు సిట్​ గుర్తించింది. వీటిని అప్పగించాలని కొన్ని రోజులుగా అడుగుతున్నా.. ప్రభాకర్​రావు వాయిదా వేస్తూ వచ్చారు. మంగళవారం ఒక ఫోన్​ను అప్పగించారు. అందులోని డేటాను డిలీట్​ చేసినట్లు అధికారులు గుర్తించారు. మరో ఫోన్​ గురించి అడిగితే.. అది అమెరికా(America)లో ఉందని ప్రభాకర్​రావు చెప్పారు. దీంతో తనని తెప్పించాలని అధికారులు ఆయనను ఆదేశించారు.

    Phone Tapping Case | అరెస్టు చేస్తారా..

    ఫోన్​ ట్యాపింగ్​ కేసు భయంతో అమెరికా పారిపోయిన ప్రభాకర్​రావు.. సుప్రీంకోర్టు అరెస్టు(Supreme Court) నుంచి రక్షణ కల్పించడంతో తిరిగి వచ్చారు. అయితే ఆయన అధికారుల విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది. దీంతో ఆయనను అరెస్ట్​ చేయాలని సిట్​ అధికారులు(SIT Officers) భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్​ వేసి ఆయన అరెస్ట్​కు అనుమతి కోరాలని చూస్తున్నారు.

    Phone Tapping Case | తీన్మార్​ మల్లన్నకు నోటీసులు

    ఫోన్​ ట్యాపింగ్​ అంశంలో నిందితులను విచారిస్తున్న సిట్​.. బాధితుల వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేసింది. ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నాయకుల స్టేట్​మెంట్​ను అధికారులు రికార్డు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న(MLC Teenmar Mallanna)కు కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఫోన్​ ట్యాప్​ అయినట్లు గుర్తించిన అధికారులు ఈ నెల 17న విచారణకు రావాలని కోరారు.

    More like this

    Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట

    అక్షరటుడే, బాన్సువాడ: Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట వేశారని బాన్సువాడ ఎస్​ఆర్​ఎన్​కే ప్రభుత్వ డిగ్రీ...

    Manisha Koirala | నేపాల్‌లో హింసాత్మక ఆందోళనలు.. ఇది ఫొటో కాదు.. హింసకు సాక్ష్యం అంటూ మ‌నీషా కోయిరాలా పోస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Manisha Koirala | పొరుగు దేశం నేపాల్ లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఆందోళనలు తీవ్ర...

    CP Sai Chaitnaya | జానకంపేట లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సీపీ పూజలు

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitnaya | జానకంపేట (janakamPet) లక్ష్మీనృసింహస్వామిని (Lord Lakshmi Narasimha Swamy) సీపీ...