Homeజిల్లాలునిజామాబాద్​Pothangal | యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్​ కోసం స్థలపరిశీలన

Pothangal | యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్​ కోసం స్థలపరిశీలన

పోతంగల్​ మండలానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైన సందర్భంగా అధికారులు బుధవారం స్థల పరిశీలన చేశారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

అక్షరటుడే, కోటగిరి: Pothangal | పోతంగల్ మండలంలోని పీఎస్​ఆర్ నగర్ వద్ద యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​ స్కూల్​ (Young India Integrated School) మంజూరైన విషయం విదితమే.

రూ.200 కోట్లతో నిర్మించనున్న ఈ స్కూల్​ కోసం బుధవారం సాయంత్రం టీఎస్​ఈడబ్ల్యూ ఐడీసీ సూపరింటెండెంట్​ ఇంజినీర్​ రవీందర్ అధికారులతో కలిసి పరిశీలించారు. స్కూల్​ నిర్మించబోయే స్థలం బౌండరీలను పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో స్కూల్​ నిర్మాణానికి (School construction) శ్రీకారం చుట్టనున్నట్టు పేర్కొన్నారు.

స్కూల్​ భవనాన్ని నాలుగు బ్లాక్​లుగా విభజించనున్నట్లు తెలిపారు. సీనియర్, జూనియర్లకు హాస్టళ్లు, డైనింగ్ హాళ్లు, స్టాఫ్ క్వార్టర్స్, ప్రిన్సిపల్ క్వార్టర్స్​ ఉంటాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వెల్ఫేర్​, సోషల్​ వెల్ఫేర్​ స్కూళ్లు ఉంటాయని పేర్కొన్నారు. స్థల పరిశీలనలో ఈఈ ప్రతాప్, డీఈ రవి, తహశీల్దార్ గంగాధర్, సర్వేయర్ పోశెట్టి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పుప్పాల శంకర్, ఎజాజ్ ఖాన్, గంగాధర్, రమేష్ సెట్, శ్రీనివాస్, రాజేందర్ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.