Homeజిల్లాలునిజామాబాద్​Sub Collector Vikas Mahato | పీహెచ్​సీ సబ్​సెంటర్​ నిర్మాణం కోసం స్థల పరిశీలన

Sub Collector Vikas Mahato | పీహెచ్​సీ సబ్​సెంటర్​ నిర్మాణం కోసం స్థల పరిశీలన

- Advertisement -

అక్షరటుడే, కోటగిరి: Sub Collector Vikas Mahato | పోతంగల్ (Pothangal)​ మండలంలోని హెగ్డేలి(Hegdely) గ్రామానికి మంగళవారం బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో సందర్శించారు. పీహెచ్​సీ సబ్​సెంటర్ (PHC Subcenter) నిర్మాణం కోసం ఆయన హెగ్డేలి రైతు వేదిక వెనక ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు.

శిఖం భూమిని పరిశీలించామని కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతు వేదిక వద్దే మరో స్థలం ఉందని గ్రామస్థులు సూచించగా ఆ స్థలాన్ని సైతం సబ్​ కలెక్టర్​ పరిశీలించారు.

స్థానిక తహశీల్దార్ గంగాధర్, సర్వేయర్ స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ స్థలాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్, సర్వేయర్ పోశెట్టి, గ్రామ పంచాయతీ కార్యదర్శి జగదీష్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.