Homeజిల్లాలునిజామాబాద్​Basti dawakana | బస్తీ దవాఖానా కోసం స్థల పరిశీలన

Basti dawakana | బస్తీ దవాఖానా కోసం స్థల పరిశీలన

- Advertisement -

అక్షరటుడే, బోధన్: Basti dawakana | పట్టణానికి రెండు బస్తీ దవాఖానాలు మంజూరయ్యాయి. ఈ మేరకు ఒక దవాఖానాను శక్కర్​నగర్​లో గతంలోనే ఏర్పాటు చేశారు. మరో దవాఖానా కోసం మంగళవారం బోధన్​ సబ్​కలెక్టర్​ వికాస్​ మహతో (Bodhan Sub-Collector Vikas Mahato) స్థలపరిశీలన చేశారు.

Basti dawakana | బ్రాహ్మణగల్లిలో..

ముందుగా గంజి ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్​ను పరిశీలించారు. అక్కడ స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అనంతరం బ్రాహ్మణగల్లీలోని (Brahmangalli) గ్రామచావడిని తనిఖీ చేశారు. ఆ ప్రాంతం బస్తీ దవాఖానా ఏర్పాటుకు అనువుగా ఉందని భావిస్తూ.. ఏర్పాట్లకు ప్రతిపాదనాలు పంపాలని డీఎంహెచ్​వోకు (DMHO) పంపాలని సూచించారు.

కాలనీల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే జీజీహెచ్ (GGH Bodhan)​కు వెళ్లాల్సి వస్తోంది. ఇది ఎంతో ప్రయాసతో కూడుకున్నది కావడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. ఆయన వెంట మున్సిపల్​ కమిషనర్​ కృష్ణజాదవ్​, డిప్యూటీ డీఎంహెచ్​వో స్రవంతి కూడా ఉన్నారు.

Must Read
Related News