అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | సీతారాంనగర్ కాలనీలోని (Sitaramnagar Colony) సమస్యలు పరిష్కరించాలని కాలనీవాసులు కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డిని (Collector Vinay Krishna Reddy) కోరారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణిలో భాగంగా వారు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. కాలనీలో పలువురు అనుమతి లేకుండా ఇళ్లను నిర్మిస్తున్నారన్నారు. కొందరు మొదటి అంతస్థును ప్రమాదకరంగా నిర్మిస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. విద్యుత్ శాఖ అధికారులు (Electricity Department), నగరపాలక సంస్థ (Municipal Corporation Nizamabad) అధికారులు తమ కాలనీని పట్టించుకోవాలని కోరారు. రోడ్లు దీనస్థితిలో ఉన్నాయని, విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉంటున్నాయన్నారు. ఇకనైనా సమస్యలను పరిష్కరించి తమ కాలనీని అభివృద్ధి చేయాలని కోరారు.