అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minister Seethakka | బీఆర్ఎస్ పార్టీకి మంత్రి సీతక్క డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులను దండుపాళ్యం బ్యాచ్ అన్న బీఆర్ఎస్ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమను దండుపాళ్యం బ్యాచ్ (Dandupalyam Batch) అని మరోసారి అంటే దంచికొడతామని హెచ్చరించారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో (Jubilee Hills Elections) ప్రచారం చేసిన సీతక్క మాట్లాడుతూ.. గులాబీ నేతలపై నిప్పులు చెరిగారు. అసలు దండుపాళ్యం బ్యాచ్ అంటే బీఆర్ఎస్ నాయకులేనని ఎద్దేవా చేశారు. ప్రజల సంక్షేమం కష్టపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Government) బీఆర్ఎస్ బ్యాచ్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేయని అభివృద్ధిని తాము చేస్తున్నామని చెప్పారు.
Minister Seethakka | బహిరంగ చర్చకు సిద్ధమా?
హైడ్రాతో (Hydraa) బీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుందని, కబ్జాలకు పాల్పడిన వారే హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. అభివృద్ధిపై ఎక్కడైనా చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
Minister Seethakka | ఆడబిడ్డల కన్నీరు మంచిది కాదు..
మహిళలు దాచుకున్న అభయహస్తం నిధులను వాడుకున్న చరిత్ర బీఆర్ఎస్ పాలకులదని సీతక్క విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని చెప్పిన కేసీఆర్.. పదేళ్లలో ఎన్ని ఇళ్లుకట్టించారని ప్రశ్నించారు. మహిళల మీద పడి ఏడవద్దని, వారి ఉసురు తగులుతుందని సీతక్క (Minister Seethakka) హెచ్చరించారు. మహిళలు ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారని, వాళ్ల ఇంటి ఆడబిడ్డ అయినా కూడా ఓర్చుకోవడం లేదని కేటీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు. ఆడోళ్ల కన్నీరు మంచిది కాదని, తన సోదరి కవితతో కన్నీళ్లు పెట్టించిన కేటీఆర్‌కు శాపం తగులుతుందన్నారు. బీజేపీకి ఎన్నికల సమయంలోనే ఎంఐఎం గుర్తుకు వస్తుందన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తోందని ధ్వజమెత్తారు.
