HomeUncategorizedAp liquor scam | మ‌ద్యం అమ్మ‌కాల విధానాల్లో సూత్ర‌ధారి జ‌గ‌నే.. అక్ర‌మ సంపాద‌న‌కి మార్గంగా...

Ap liquor scam | మ‌ద్యం అమ్మ‌కాల విధానాల్లో సూత్ర‌ధారి జ‌గ‌నే.. అక్ర‌మ సంపాద‌న‌కి మార్గంగా ఈ వ్యాపారం..!

- Advertisement -

అక్షరటుడే, అమరావతి: Ap liquor scam : మద్యం Liquor విధానంలో భారీ అక్రమాలకు సంబంధించి విచారణను వేగవంతం చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్).సుమారు 200 పేజీలతో రూపొందించిన ఈ ఛార్జ్ షీట్‌లో ముగ్గురు కీలక వ్యక్తులపై తీవ్ర ఆరోపణలు నమోదు చేసినట్లు సమాచారం.కీలక నిందితులుగా ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఉన్నారు.ఈ ముగ్గురి కాల్ డేటా రికార్డులు, గూగుల్ టేక్ అవుట్ సమాచారం, ల్యాప్‌టాప్‌లోని కీలక డేటా తదితర ఆధారాలను ఛార్జ్ షీట్‌లో పొందుపరిచారు అధికారులు . అయితే మద్యం వ్యాపారాన్ని అక్ర‌మ సంపాద‌న‌గా మార్చుకోవడంలో జ‌గ‌న్ నిర్ణ‌యాలు ఎలా తీసుకున్నారు అనేది కూడా సిట్ వివ‌రించింది. ప్ర‌స్తుతం నిందితులుగా ఉన్న అధికారులే ఈ వ్యాపారం మొత్తాన్ని త‌మ క‌నుస‌న్న‌ల్లో నడిపించార‌ని అనుబంధ చార్జి షీట్ లో సిట్ పేర్కొంది.

Ap liquor scam : సూత్ర‌ధారులు వీరే..

మద్యం విధాన మార్పులు, సిండికేట్ సమావేశాలు, ముడుపుల లావాదేవీల వెనుక ధ‌నుంజ‌య్ రెడ్డి, కృష్ణ మోహ‌న్ రెడ్డి, భార‌తి సిమెంట్స్ డైరెక్ట‌ర్ గోవింద‌ప్ప బాలాజీ పాత్రలు కీలకంగా ఉన్నట్లు సిట్ నిర్ధారించింది.ముడుపులు ఎలా సేకరించాలి, ఎక్కడ దాచాలి, బ్లాక్ మనీని వైట్‌గా ఎలా మార్చాలి అనే అంశాల్లో బాలాజీ గోవిందప్ప కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ధనుంజయ్ రెడ్డి మద్యం విధాన రూపకల్పనలో అడుగడుగునా జోక్యం చేసుకున్నట్టు ఆధారాలు లభించాయి.మద్యం ముడుపులు ఎవరి వద్ద నుంచి ఎంతగా వచ్చాయి? ఎవరెవరికి చేరాయి? అనే వివరాలు కూడా సిట్ Sit సేకరించింది.ఈ ముగ్గురు విజయ్ సాయిరెడ్డి, మిథున్ రెడ్డిలతో ఫోన్ సంభాషణలు జరిపినట్లు ఆధారాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

లిక్కర్ సిండికేట్ సమావేశాలకు ధనుంజయ్ రెడ్డి పలు మార్లు హాజరయ్యారని గూగుల్ టేక్ అవుట్ ఆధారాలతో సిట్ స్పష్టం చేసింది.అక్రమంగా వచ్చిన ముడుపులను ధనుంజయ్, కృష్ణమోహన్‌లు Krishna mohan బినామీల పేర్లతో పెట్టుబడులుగా మళ్లించినట్లు సిట్ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను సేకరించినట్లు తెలిపింది.గత నెల జులై 19న, సిట్ మొదటి ఛార్జ్ షీట్‌ను 305 పేజీలతో దాఖలు చేసిన సంగతి తెలిసిందే.అందులో రాజ్ కేసిరెడ్డి ద్వారా వచ్చిన ముడుపులు మిథున్ రెడ్డి, విజయ్ సాయిరెడ్డి, చివరకు అప్పటి సీఎం జగన్‌కు చేరాయని స్పష్టం చేసిన సంగతి గమనార్హం. ఈ కేసులో మరిన్ని అరెస్టులు, విచారణలు, రాజకీయ ప్రకంపనలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో… సిట్ రెండో ఛార్జ్ షీట్ మరింత దృష్టి ఆకర్షించనుంది.అయితే అప్ప‌ట్లో బేవ‌రేజస్ కార్పొరేష‌న్‌లో అనేక అక్ర‌మాలు చోటు చేసుకున్నా కూడా ఏ నాడు ఉన్నాతాధికారులు చ‌ర్య‌లు తీసుకోలేదు. అవ‌క‌తవ‌క‌లు జ‌రిగిన‌ట్టు 2020లో గుర్తించినా కూడా ఏ నాడు చ‌ర్య‌లు తీసుకోలేద‌ని రికార్డుల ద్వారా అర్ధ‌మ‌వుతుంది. ఈ అక్ర‌మాల‌పై అప్ప‌టి ముఖ్య‌మంత్రి కార్యాల‌య కార్య‌ద‌ర్శి ధ‌నుంజ‌య రెడ్డికి కూడా తెలియ‌జేసిన‌ట్టు నాటి ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌జిత్ భార్గ‌వ్ సిట్ విచార‌ణ‌లో తెలియ‌జేశారు.