HomeతెలంగాణPhone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో సిట్​ దూకుడు

Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో సిట్​ దూకుడు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Phone Tapping Case | తెలంగాణ(Telangana)లో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ కేసులో సిట్​ దూకుడు పెంచింది. బీఆర్​ఎస్​ హయాంలో రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్(Phone Tapping)​ చేశారని సిట్(Sit)​ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్​ ప్రభాకర్​రావు(Former SIB chief Prabhakar Rao)ను ఇప్పటికే పలుమార్లు సిట్​ అధికారులు విచారించారు. ఈ క్రమంలో ఆయన పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. గురువారం మరోసారి ప్రభాకర్​రావును సిట్‌ అధికారులు విచారించనున్నారు.

ఫోన్​ ట్యాపింగ్​ కేసు(Phone Tapping Case)లో మరో నిందితుడు ప్రణీత్​రావు(Praneeth Rao)ను బుధవారం అధికారులు 8 గంటల పాటు విచారించారు. ఎన్నికల ముందు ఎస్​ఐబీలో స్పెషల్​ ఆపరేషన్ టార్గెట్(SIB Special Operation Target)​ను ఆయన లీడ్​ చేశారు. ఎన్నికల ఫలితాలు రాగానే ప్రభాకర్​రావు ఆదేశాల మేరకు ప్రణీత్​రావు ఫోన్​ ట్యాపింగ్​ ఆధారాలను ధ్వంసం చేశారు. హార్డ్​ డిస్క్​లను ధ్వంసం చేసి మూసిలో పడేశాడు. ఈ క్రమంలో గురువారం ప్రభాకర్​రావు, ప్రణీత్​రావు ఇద్దరిని కలిపి సిట్ విచారించనుంది.