HomeతెలంగాణPhone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో సిట్​ దూకుడు

Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో సిట్​ దూకుడు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో సిట్​ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్​ఐబీ మాజీ చీఫ్​ ప్రభాకర్(Former SIB chief Prabhakar)​ అమెరికా నుంచి రావడంతో ఆయనను అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో బాధితుల స్టేట్​మెంట్​ సైతం తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఫోన్​ట్యాపింగ్​(Phone Tapping)కు గురైన రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఆదివారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించనున్నారు.

Phone Tapping Case | మూడు సార్లు విచారణ

బీఆర్​ఎస్ హయాంలో ఎస్​ఐబీ చీఫ్​గా ఉన్న ప్రభాకర్​రావు ప్రతిపక్ష నాయకులతో పాటు వ్యాపారులు, జడ్జీలు(Judges), సినీ ప్రముఖుల(movie celebrities) ఫోన్లు ట్యాప్​ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక కేసు నమోదు చేసి విచారణ కోసం సిట్​ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్​ రావు కేసు నమోదు అయిన మరుసటి రోజే అమెరికా(America) వెళ్లిపోయారు. సుప్రీంకోర్టు(Supreme Court) అరెస్ట్ నుంచి రక్షణ కల్పించడంతో ఆయన జూన్​ 9న తిరిగి వచ్చారు. ఈ క్రమంలో సిట్​ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. అయితే మూడు రోజుల పాటు ప్రభాకర్​రావును అధికారులు 27 గంటల పాటు విచారించారు. అయినా ఆయన నోరు విప్పడం లేదని సమాచారం.

Phone Tapping Case | రివ్యూ కమిటీకి అన్ని తెలుసు

ఇప్పటికే ప్రభాకర్​ రావును సిట్​ మూడు సార్లు విచారించింది. ఈ నెల 17న మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్‌(FSL report) ఆధారంగా సిట్‌ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రభాకర్​రావు ఫోన్లను సైతం అధికారులు పరిశీలించారు. పైఅధికారుల ఆదేశాలతోనే ట్యాపింగ్ జరిగిందని ప్రభాకర్​ చెప్పినట్లు సమాచారం. రివ్యూ కమిటీకి అన్ని విషయాలు తెలుసిన ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ట్యాపింగ్‌ బాధితుల స్టేట్‌మెంట్లు తీసుకొని కేసును మరింత బలంగా ముందుకు తీసుకు వెళ్లాలని సిట్​ భావిస్తోంది.