ePaper
More
    HomeజాతీయంKarnataka | పరువు పోతుందని తోడబుట్టిన తమ్ముడిని కడతేర్చిన అక్క!

    Karnataka | పరువు పోతుందని తోడబుట్టిన తమ్ముడిని కడతేర్చిన అక్క!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Karnataka : కుటుంబ గౌరవాన్ని మంటగలిపాడని ఓ యువకుడిన(23)ని అతడి సోదరి, బావ కలిసి హతమార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘటన కలకలం రేపుతోంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా Chitradurga district లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

    హతుడికి HIV పాజిటివ్‌ (HIV positive) అని తేలడంతో.. ఎక్కడ కుటుంబం పరువు పోతుందోనని భయపడి, సొంత అక్కే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

    చిత్రదుర్గ జిల్లా హోళల్కెరె తాలూకా(Holalkere taluka) దుమ్మీ గ్రామానికి(Dummi village) యువకుడు(23 ) ఈ నెల(జులై) 25న హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా బాధితుడి అక్కయ్య నిషాను అదుపులోకి తీసుకున్నారు. ఆమె భర్త మంజునాథ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

    Karnataka : అసలేం జరిగిందంటే..

    పోలీసుల కథనం ప్రకారం.. బాధిత యువకుడు దుమ్మీ గ్రామంలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటాడు. బెంగళూరులోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసేవాడు. తరచూ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో జులై 23న కారులో గ్రామానికి వస్తుండగా.. మార్గమధ్యలో రోడ్డుపై ఆగిఉన్న ట్రక్కును ఢీకొన్నాడు. దీంతో బాధిత యువకుడు తీవ్రంగా గాయపడగా.. చికిత్స నిమిత్తం దావణగెరెలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. హాస్పటల్​లో శస్త్రచికిత్సకు ముందు రక్త పరీక్షలు నిర్వహించగా.. సదరు యువకుడికి ఎయిడ్స్(HIV పాజిటివ్) సోకినట్లు తేలింది. దీంతో వైద్యులు అతడిని వేరే హాస్పిటల్​కు తీసుకెళ్లాలని సూచించారు.

    READ ALSO  Bank Holidays | ఆగస్టులో బ్యాంకులు పనిచేసేది మూడు వారాలే..

    దీంతో జులై 25న నిషాతోపాటు ఆమె భర్త కలిసి మల్లికార్జున్​ను తీసుకొని బెంగళూరు బయలుదేరారు. కానీ, కొన్ని గంటల్లోనే తిరిగి వచ్చేశారు. అప్పటికే ఆ యువకుడు చనిపోయి ఉన్నాడు. మార్గమధ్యలో చనిపోయాడని చెప్పుకొచ్చారు. అనుమానం వచ్చి అతడి తండ్రి నాగరాజప్ప నిలదీయగా.. తమ్ముడు​ హెచ్​ఐవీ సోకిందని బాధ వ్యక్తం చేసినట్లు నిషా తెలిపింది. దీనికితోడు అప్పులతో సతమతమవుతున్నట్లు తెలిపినట్లు పేర్కొంది. తాను చనిపోవాలనే కోరికను తమ్ముడు​ వెల్లడించినట్లు చెప్పుకొచ్చింది. అతడి కోరిక మేరకు గొంతునొక్కి చంపేసినట్లు అక్కా, బావ వివరించినట్లు పోలీసులు తెలిపారు.

    దీంతో మల్లికార్జున్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

    Latest articles

    School inspection | చంద్రాయన్​పల్లి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

    అక్షరటుడే, ఇందల్వాయి: School inspection | మండలంలోని చంద్రాయన్​పల్లి గ్రామంలో (Chandrayanpalli village) గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను...

    Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్​ పాదయాత్రలో మార్పులు.. మారిన షెడ్యూల్​ వివరాలివే..

    అక్షరటుడే ఆర్మూర్ : Meenakshi Natarajan | కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)​,...

    PM Kisan | రైతులకు గుడ్​న్యూస్​.. నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Kisan | కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. 20వ విడత...

    IND vs ENG | ర‌ఫ్ఫాడించిన భార‌త బౌల‌ర్స్.. టీమిండియా ఎంత ఆధిక్యంలో ఉందంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs ENG | ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా(Team India) బౌలింగ్‌తో...

    More like this