అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Village Sarpanch | పంచాయతీ ఎన్నికల్లో (Panchayat elections) విజయం సాధించిన సర్పంచ్ల ప్రమాణ స్వీకారోత్సవాలు జిల్లాలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో సోమవారం పాలకవర్గాలు కొలువుదీరాయి.
Village Sarpanch | సిర్పూర్లో..
సిర్పూర్ గ్రామ (Sirpur village) సర్పంచ్‌గా బొడ్డు గౌతమి గణేష్ సోమవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. నమ్మకంతో ప్రజలు తనను గెలిపించుకున్నారని.. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Village Sarpanch | న్యాల్కల్ సర్పంచ్‌గా..
న్యాల్కల్ గ్రామ (Nyalkal village) సర్పంచ్‌గా రాయికంటి చంద్రకళ గంగాప్రసాద్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
