HomeతెలంగాణKTR Camp Office | కేటీఆర్ క్యాంప్ ఆఫీసు వ‌ద్ద ఉద్రిక్త‌త‌..

KTR Camp Office | కేటీఆర్ క్యాంప్ ఆఫీసు వ‌ద్ద ఉద్రిక్త‌త‌..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:KTR Camp Office | ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మ‌ధ్య ఎలాంటి వాతావ‌ర‌ణం నెల‌కొని ఉందో మ‌నంద‌రికి తెలిసిందే. ఒక‌రిపై మరొకరు విమ‌ర్శ‌లు చేస్తూ.. రాజ‌కీయాన్ని హీటెక్కిస్తున్నారు.

ఇక ఇదే స‌మ‌యంలో సిరిసిల్ల నియోజకవర్గంలోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ (Former Minister KTR) క్యాంప్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్ర‌య‌త్నించిన నేప‌థ్యంలో వారిని బీఆర్ఎస్ నేత‌లు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో ఇరువురి మ‌ధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

KTR Camp Office | నినాదాలు..

కాగా.. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు(Police) ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్(lathi charge) చేయాల్సి వ‌చ్చింది. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అయితే సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్‌ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. మరోవైపు కేటీఆర్‌ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కేటీఆర్(KTR) ఫోటో పెట్టడం లేదంటూ బీఆర్ఎస్ BRS నేత‌లు ఆందోళ‌న చేశారు. ఈ నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను కేటీఆర్‌ క్యాంప్ కార్యాలయంలో ఎందుకు పెట్టకూడదంటూ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు సైతం ఆందోళనకు దిగారు.

సీఎం ఫోటోతో కేటీఆర్‌ క్యాంపు కార్యాలయం(KTR Camp Office)లో దూసుకెళ్లేందుకు ప్రయత్నించ‌గా, గేటు వద్దే బీఆర్‌ఎస్ కార్యకర్తలు(BRS Leaders) వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొంది. దాదాపు 15 నిమిషాల పాటు రెండు పార్టీల నేతలు ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. ఈ తోపులాట‌ల‌లో ముగ్గురు కార్య‌క‌ర్త‌లు గాయ‌ప‌డిన‌ట్టు తెలుస్తుంది. ఈ గొడ‌వ‌పై ముఖ్య నేతలెవరూ ఇంత వ‌ర‌కు స్పందించ‌లేదు. ప్ర‌స్తుతం కేటీఆర్ క్యాంపు ఆఫీసు Camp Office వద్ద భారీ బందోబ‌స్త్ ఏర్పాటు చేశారు.