HomeUncategorizedSinger Mangli | సింగ‌ర్ మంగ్లీ బ‌ర్త్ డే పార్టీలో దొరికిన డ్ర‌గ్స్.. ఏం జరిగిందంటే..!

Singer Mangli | సింగ‌ర్ మంగ్లీ బ‌ర్త్ డే పార్టీలో దొరికిన డ్ర‌గ్స్.. ఏం జరిగిందంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Singer Mangli | సింగ‌ర్ మంగ్లీ త‌న పాట‌ల‌తో శ్రోత‌ల‌ను ఎంత‌గా అల‌రిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న గొంతు నుండి వ‌చ్చే ఏ పాట అయిన ప్ర‌తి ఒక్క‌రిని ప‌ర‌వ‌శింప‌జేస్తుంది. అయితే మంగ్లీ (Mangli) ఒక్కోసారి వివాదాల‌తో వార్త‌ల‌లో నిలుస్తుంటుంది. మంచి గాయనిగా పేరు తెచ్చుకుంటున్న సింగర్ మంగ్లీ తాజాగా తన బర్త్ డే పార్టీ(Birthday Party)ని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఓ ప్రైవేటు రిసార్ట్ లో ఇచ్చింది. ఈర్ల పల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్(Tripura Resort)లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో కొంత మంది డ్రగ్స్(Drugs) తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ బర్త్ డే పార్టీకి 50 మంది వరకు ఫ్యామిలీ మెంబర్స్​తో పాటు ఇతర సెలబ్రిటీలు హాజరయ్యారు.

Singer Mangli | లోతైన ద‌ర్యాప్తు..

ఇందులో 9 మంది గంజాయి(Drugs) వాడినట్టు పాజిటివ్ రిపోర్ట్ రావడం కలకలం రేపుతుంది. ముఖ్యంగా ఈ పార్టీకి ఆమె ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పోలీసులు వెల్లడించారు. అంతేకాదు సింగర్ మంగ్లీపై పోలీసులు కేసునమోదు(Police Case Filed) చేశారు. మంగ్లీ బర్త్‌డే పార్టీ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించగా.. ఈ దాడుల్లో భారీగా గంజాయి, విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీకి హాజరైన పలువురికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో డ్రగ్స్ పాజిటివ్‌గా తేలడం కలకలం సృష్టించింది. డ్ర‌గ్స్ వాడ‌కం అనేది మంగ్లీకి తెలిసి జ‌రిగిందా, లేకుంటే ఆమెకు తెలియకుండా కొంత మంది ఈ డ్రగ్స్ Drugs వాడారా అనేది తేలాల్సి ఉంది.

ఈ పార్టీలో అర్ధరాత్రి రెండు గంటల తర్వాత ఎస్వీటీ పోలీసులు దాడులు(SVT Police raids) చేపట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడుల్లో దాదాపుగా 40 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు (ndps) యాక్టు సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద కేసులు కట్టారు. ఈ విషయమై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ పార్టీలో డ్రగ్స్, గంజాయితో పాటు విదేశీ మద్యం సీసాలు దొరికినట్టు సమాచారం. అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డీజేను పోలీసులు సీజ్ చేశారు. మంగ్లీ బర్త్ డే పార్టీ (Birthday Party)లో పాల్గొన్న దివి, కాసర్ల శ్యామ్. మరోవైపు త్రిపుర రిసార్ట్ జనరల్ మేనేజర్ శివరామకృష్ణపై కేసు నమోదు చేశారు. డ్రగ్స్ వినియోగించిన వారిలో కొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో సినీ వర్గాల్లో, ముఖ్యంగా యువతలో మాదకద్రవ్యాల వాడకంపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.