అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Singer Chinmayi | ప్రముఖ సింగర్ చిన్మయి సోషల్ మీడియాలో (Social Media) యాక్టివ్‌గా ఉంటారు. మహిళా హక్కుల కోసం ఆమె ఆన్‌లైన్‌లో పోరాటం చేస్తారు. అయితే ఇటీవల ఆమెను కొందరు ట్రోలింగ్ చేశారు.
ఇటీవల కొందరు తనను ఆన్‌లైన్‌లో చాటింగ్ చేస్తూ దూషిస్తున్నారని చిన్మయి పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు (Hyderabad CP Sajjanar) గురువారం ఫిర్యాదు చేశారు. అసభ్యకర పదాలతో తనపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన పిల్లలు చనిపోవాలని ట్రోలర్స్ కోరుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్మయి భర్త రాహుల్ ఇటీవల మంగళసూత్రం విషయంలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆమెకు ఇష్టం ఉంటేనే.. తాళి వేసుకుంటుందన్నారు. ఈ క్రమంలో ఆ కామెంట్స్‌పై ఓ యువకుడు ట్రోల్ చేశాడు.
Singer Chinmayi | పిల్లలను సైతం
ఇటీవల సెలబ్రెటీలను లక్ష్యంగా చేసుకొని కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ఇష్టం వచ్చినట్లు ట్రోలింగ్ చేస్తున్నారు. వారి పిల్లలను సైతం ట్రోల్ చేస్తున్నారు. చిన్మయి లాంటివారికి అసలు పిల్లలు పుట్టకూడదని.. పుట్టినా చచ్చిపోవాలని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఈ క్రమంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులను (Cybercrime Police) సీపీ సజ్జనార్ ఆదేశించారు.
Singer Chinmayi | నిత్యం వార్తల్లో..
సింగర్ చిన్మయి (Singer Chinmayi) తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. గతంలో ట్రోలింగ్‌ను పట్టించుకోని ఆమె తాజాగా.. పిల్లలను కూడా లాగడంతో పోలీసులను ఆశ్రయించింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
