అక్షరటుడే, వెబ్‌డెస్క్ :MLC Kavitha | కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సింగరేణి జాగృతి(Singareni Jagruti)ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ప్రకటించారు.
మంగళవారం హైదరాబాద్ లోని తన నివాసంలో మాట్లాడారు. టీబీజీకేఎస్ తో సమన్వయం చేసుకుంటూ కార్మికుల సంక్షేమం కోసం పని చేస్తామని, సంస్థను కాపాడటమే సింగరేణి జాగృతి ధ్యేయమన్నారు. ఇందుకు గాను 11 ఏరియాలకు కో-ఆర్డినేటర్లను నియమించినట్లు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్దరించి సింగరేణిని రక్షించుకున్నామని, అలాంటి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) అవినీతితో అంతం చేయాలని చూస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. ప్రధాని మోదీ (PM Modi) కోసం పని చేస్తున్నాడని ఆరోపించారు. అందుకే కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసే లేబర్ కోడ్ పై ఒక్కమాట కూడా మాట్లాడటం లేదన్నారు. తాము కార్మికులకు అండగా ఉంటామన్నారు.