అక్షరటుడే, వెబ్‌డెస్క్: Singareni Diwali Bonus | తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (Singareni Collieries Company Limited – SCCL) కీలక నిర్ణయం తీసుకుంది.
కార్మికుల కుటుంబాలలో దీపావళి పండుగ Diwali festival సందడిని మరింత పెంచింది. దీపావళి ఢమాకా మోగించింది.
సింగరేణి ఉద్యోగులకు ప్రాఫిట్ లింక్డ్ రివార్డ్ (Profit Linked Reward – PLR) బోనస్ అందించబోతోంది. దసరా అడ్వాన్స్ సైతం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులు భారీగా ఆర్థిక ప్రయోజనం పొందబోతున్నారు.
Singareni Diwali Bonus | పండుగకు ముందే..
దీపావళి పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులకు ప్రాఫిట్ లింక్డ్ రివార్డ్ (PLR) బోనస్‌ను నేడు (ఈ నెల 17వ తేదీ) అందించనుంది. ప్రతి సింగరేణి కార్మికునికి రూ. 1,03,000 చొప్పున PLR బోనస్ డబ్బులు వారి ఖాతాల్లో జమ కానున్నాయి.