HomeUncategorizedRajinikanth | ర‌జ‌నీకాంత్ క్రేజ్ అంటే ఇది క‌దా.. ప‌వర్ హౌజ్ పాట‌కి సింగ‌పూర్ పోలీసుల...

Rajinikanth | ర‌జ‌నీకాంత్ క్రేజ్ అంటే ఇది క‌దా.. ప‌వర్ హౌజ్ పాట‌కి సింగ‌పూర్ పోలీసుల స్పెష‌ల్ వీడియో

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajinikanth | సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth) మేనియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా తలైవాకు అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న సినిమా విడుదలైతే అది పండగలా మారుతుంది. థియేటర్లలో హంగామా ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇక ఇప్పుడు తలైవా ‘కూలీ’ సినిమాతో (Coolie Movie) మరోసారి బాక్సాఫీస్‌ దద్దరిల్లించేందుకు సిద్ధమయ్యారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రజనీ సరసన నాగార్జున (Akkineni Nagarjuna), ఆమిర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్ హీరోలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

Rajinikanth | ద‌టీజ్ ర‌జ‌నీ..

ఆగస్ట్ 14న కూలి చిత్రం వరల్డ్‌వైడ్‌గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. భారతదేశం మాత్రమే కాదు, విదేశాల్లోనూ ‘కూలీ’ అడ్వాన్స్ బుకింగ్స్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమైపోయాయి. ఇండియాలోనూ అన్ని రాష్ట్రాల్లో టికెట్లు జెట్ స్పీడ్‌లో సేల్ అవుతున్నాయి. రజనీ పాపులారిటీ మ‌రోసారి స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఇక ‘కూలీ’ మూవీ నుంచి ఇటీవల విడుదలైన “పవర్ హౌస్” సాంగ్ (Power House Song) నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఇక్క‌డ‌ ట్విస్ట్ ఏంటంటే… సింగపూర్ పోలీస్ ఫోర్స్ (Singapore Police Force) తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ పాటకు సంబంధించిన ఓ క్రేజీ వీడియో షేర్ చేసింది.

ఈ వీడియోలో సింగ‌పూర్ పోలీసులు త‌మ‌ యూనిఫార్మ్స్‌లో “పవర్ హౌస్” బీట్‌కు వైబ్ సెట్ చేస్తూ ఇచ్చిన ప్రెజెంటేషన్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఈ వీడియో చూసిన తలైవా ఫ్యాన్స్ “ఇది రజనీ స్టైల్!” అంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ (Anirudh Ravichandran) మ్యూజిక్ కంపోజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఆయన అందించిన సంగీతం సినిమాకు చాలా ప్ల‌స్ అయింద‌నే చెప్పాలి. ఇప్పటికే విడుదలైన పాటలు భారీ రెస్పాన్స్‌ను పొందాయి.ఒక్క‌సారి ర‌జ‌నీ కూలీ థియేట‌ర్స్‌లోకి వ‌స్తే “కూలీ”తో Coolie ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తారో అని అంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు. అందరికీ ఇదొక ఎపిక్ మాస్ ఫెస్టివల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.