Homeబిజినెస్​Silver Rates | వామ్మో.. వెండి ధర తెలిస్తే షాక్ అవుతారు..!

Silver Rates | వామ్మో.. వెండి ధర తెలిస్తే షాక్ అవుతారు..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Silver Rates | దేశంలో బంగారంతో పాటు వెండి ధ‌ర‌లు (gold and silver prices) కూడా ప‌రుగులు పెడుతున్నాయి. ఒక‌వైపు బంగారం ధ‌ర‌లు తులం (Gold Price) రూ.ల‌క్ష‌కి చేరువ‌వుతుంటే.. మ‌రోవైపు వెండి కిలో ధ‌ర‌ రూ.ల‌క్ష‌ని క్రాస్ చేసింది.

అంతర్జాతీయ మార్కెట్లో (international market) సిల్వర్ ధర నింగిని తాకింది. ఏకంగా 12 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టింది. MCX ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,04,947 దాటింది. ఇక కామెక్స్‌లో వెండి ఔన్సుకు 34.87 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆగస్టు 2012 తర్వాత అత్యధిక స్థాయిలో ఈ ధర పలకడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ వెండి ధరలు (Spot silver prices) బుధవారం ఔన్సుకు 2.8% పెరిగి 35.43 డాలర్లకు చేరుకున్నాయి.

Silver Rates | వెండి ధ‌ర‌లు ఇలా..

నేటి వెండి ధర (silver prices) కిలో రూ.1,14,000. వెండి ప్రాచీన కాలం నుండి విలువైన లోహంగా ప్రసిద్ధిచెందింది. ఇది ఆభరణాలు, నాణేలు (jewelry and coins) మరియు వంటపాత్రలుగా ఉపయోగిస్తున్నారు. వెండిని విద్యుత్ పరికరాలలో, అద్దాలు మరియు రసాయనిక చర్యలలో ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తున్నారు. ఈ మ‌ధ్య వివాహ వేడుక‌ల్లో(wedding ceremonies) సైతం బంగారం త‌ర్వాత వెండికే ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. అలాంటి నేప‌థ్యంలో వెండి ధ‌ర పైపైకి పోతుంది. కమోడిటీ మార్కెట్‌లో ఒక్కరోజే రూ.3,016 పెర‌గ‌డంతో అంద‌రూ అవాక్క‌వుతున్నారు. వెండి ధరలు (silver prices) పెరగడానికి ప్రధానంగా కారణాలు చూస్తే.. లోహాలకు డిమాండ్ పెరగడం, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితితో పాటుగా పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడం వంటివి సిల్వర్ పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

ఇక ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు అంచనాలు వెండి ధరను పెరిగేలా చేస్తున్నాయని చెప్పుకొస్తున్నారు. వడ్డీ రేట్లలో (interest rates) కోతలు ఉంటాయనే వార్తల నేపథ్యంలో వెండికి భారీగా డిమాండ్ ఏర్పడింది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు (interest rates) తగ్గించి డాలర్ Dollar బలహీనపడితే.. వెండి కిలోకు రూ 1.10 లక్షల వరకు స్థాయిలను చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. తాజాగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ప్రకారం జూన్ 5న వెండి ఫ్యూచర్స్ రూ.1,14,000 వద్ద తాజా రికార్డు గరిష్టాన్ని తాకింది.