అక్షరటుడే, వెబ్‌డెస్క్: Silver Prices Fall Sharply | దేశంలో బంగారం, వెండి ధరల ట్రెండ్ ఇన్వెస్టర్లను అయోమయానికి గురిచేస్తోంది. ఒక రోజు భారీగా పెరిగితే, మరుసటి రోజు అదే స్థాయిలో పడిపోతున్నాయి. గత రెండు రోజులుగా బంగారం ధర (Gold Rates)ల్లో వరుస పతనం కనిపిస్తోంది.
వెండి ధర (Silver Price) కూడా ఇవాళ ఒక్కసారిగా క్షీణించింది. 24 క్యారట్ గోల్డ్ (10 గ్రాములు): రూ.2,620 తగ్గి రూ.1,58,400 నుంచి రూ.1,55,780కి చేరింది. 22 క్యారట్ గోల్డ్ (10 గ్రాములు): రూ.2,400 తగ్గి రూ.1,45,200 నుంచి రూ.1,42,800కి పడిపోయింది. 18 క్యారట్ గోల్డ్ (10 గ్రాములు): రూ.1,960 తగ్గి రూ.1,18,800 నుంచి రూ.1,16,840కి చేరింది. తులం బంగారం ధర రూ.2,500 పైగా తగ్గడం వినియోగదారులకు ఊరటనిచ్చే విషయం.
Silver Prices Fall Sharply | వెండి ధరలో భారీ పతనం
కిలో వెండి ధర రూ.20,000 తగ్గి రూ.3,00,000 నుంచి రూ.2,80,000కు చేరింది. తులం వెండి ప్రస్తుతం రూ.2,800 వద్ద లభిస్తోంది. వెండి ధర ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో పడిపోవడం మార్కెట్లో చర్చనీయాంశమైంది. ఎంసీఎక్స్‌లో Mcx పరిస్థితి దేశీయ స్పాట్ మార్కెట్లో ధరలు తగ్గినప్పటికీ (ఎంసీఎక్స్)లో మాత్రం ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో వేరే ట్రెండ్ కనిపిస్తోంది. గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 1.22% (రూ.1,863) పెరిగి రూ.1,54,699 వద్ద ట్రేడ్ అవుతోంది. సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ 2.94% (రూ.6,961) పెరిగి రూ.2,43,396 వద్ద ట్రేడ్ అవుతోంది. ఫ్యూచర్స్ మార్కెట్లో పెట్టుబడిదారులు తక్కువ ధరల వద్ద కొనుగోళ్లు ప్రారంభించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ (International Market)లో ఔన్స్ బంగారం ధర 5000 డాలర్ల దిగువకు చేరి ప్రస్తుతం 4990 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఔన్స్ వెండి ధర 80 డాలర్ల కంటే తక్కువగా 77.57 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అమెరికా నుంచి వచ్చిన బలమైన ఉద్యోగాల డేటా కారణంగా వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాలు తగ్గాయి. దీంతో అమ్మకాలు పెరిగి ధరలు ఒక వారం కనిష్టానికి చేరాయి. అయితే తక్కువ ధరల వద్ద కొనుగోళ్లు మళ్లీ ప్రారంభమవడంతో ధరలు కొంత కోలుకున్నాయి.