అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sonia Gandhi | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ(Sonia Gandhi ) స్పందించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఆమె ఖండించారు. గాజా, ఇరాన్ విషయంలో కేంద్రం మౌనం వీడాలని ఆమె డిమాండ్ చేశారు. గాజాలో నరమేధంపై భారత్ మౌనం మంచిది కాదన్నారు. భారత్(Bharath)కు ఇరాన్ చిరకాల మిత్రదేశమని, దానిని దూరం చేసుకోవడం మంచిది కాదని సోనియా గాంధీ అన్నారు.
ఇరాన్ – ఇజ్రాయెల్(Iran – Israel) యుద్ధంపై భారత్ తటస్థ వైఖరి అవలంభిస్తోంది. ఈ క్రమంలో సోనియా గాంధీ మాట్లాడుతూ.. గాజా-ఇరాన్ విషయంలో భారత్ మౌనంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది గొంతు కోల్పోవడం కాదు.. విలువలు కోల్పోవడం అని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం అనుసరిస్తున్న వైఖరి భారత దేశ నైతిక, వ్యూహాత్మక సంప్రదాయం నుంచి దూరంగా జరిగినట్లుగా కనిపిస్తోందని ఆమె అన్నారు.
Sonia Gandhi | అది సరైన చర్య కాదు
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు దిగడం సరైన చర్య కాదని సోనియా గాంధీ అన్నారు. టెహ్రాన్(Tehran)పై, టెల్ అవీవ్(Tel Aviv) చేస్తున్న దాడులు చట్టవిరుద్ధమైనవిగా.. సార్వభౌమాధికార ఉల్లంఘనగా అభివర్ణించారు. ఇరాన్, అమెరికాల మధ్య అణు చర్చలకు మార్గం సుగమం అవుతున్న సమయంలో అణుస్థావరాలపై దాడులకు దిగడాన్ని ఆమె తప్పుబట్టారు. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆమె అన్నారు. గాజాలో జరిగిన విధ్వంసం ఇరాన్‌లో పునరావృతం అవకుండా భారత్ కల్పించుకోవాలని కోరారు.