ePaper
More
    HomeతెలంగాణSigachi | మావాళ్లు ఎక్కడున్నారో చెప్పండి.. సిగాచీ వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన

    Sigachi | మావాళ్లు ఎక్కడున్నారో చెప్పండి.. సిగాచీ వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sigachi : సిగాచీ పరిశ్రమ (Sigachi industry) ప్రమాద బాధిత కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. తమ వాళ్లు ఉన్నారో, లేదో తెలియక బాధిత కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

    సంగారెడ్డి జిల్లా (Sangareddy district) పాశమైలారం (Pashamilaram) లోని సిగాచీ పరిశ్రమలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర ప్రాణ నష్టాన్ని కలిగించింది. పొట్ట కూటికోసం పనికి వెళ్లిన కార్మికుల జీవితాలను బుగ్గి చేసింది. కాగా, ప్రమాదం జరిగి నాలుగు రోజులైనా తమవారి ఆచూకీ లభించలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

    తమ వాళ్లు బతికున్నారో.. లేదో తెలియడం లేదని.. తమవారి ఆచూకీ తెలపాలంటూ బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నాలుగు రోజులుగా పరిశ్రమ వద్ద పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే వారే లేరంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.

    READ ALSO  Weather Updates | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    Sigachi : రాయితో తల పగలగొట్టుకున్న ఓ బాధిత తండ్రి..

    ప్రమాదం జరిగిన చోట చెత్త తొలగించారని బాధితులు చెబుతున్నారు. ఆ తర్వాత చేపట్టాల్సిన సహాయక చర్యల్లో మాత్రం తాత్సారం చేస్తున్నారంటూ వాపోతున్నారు. హైడ్రా లాంటి వ్యవస్థలున్నా ఎందుకు ఆలస్యం అవుతోందని అధికారులను నిలదీస్తున్నారు. ప్రమాదంలో కనిపించకుండా పోయిన జస్టిన్ ఆనే కార్మికుడి తండ్రి తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. తమ కొడుకు ఏమయ్యాడో చెప్పాలంటూ రాయితో తల పగలగొట్టుకున్నారు. అధికారులు అతడికి ఆసుపత్రిలో చికిత్స అందించారు.

    పరిశ్రమ బాధితుల్లో బిహార్​ Bihar కార్మికులు ఉండటంతో ఆ రాష్ట్ర అధికారులు వచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలు సేకరించారు. మరణించిన కార్మికుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, తమవారు

    కనిపించడం లేదని బాధితుల కుటుంబ సభ్యులు ఇంకా ఫొటోలు పట్టుకుని తిరుగుతున్నారు. మరికొందరు డీఎన్​ఏ DNA ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

    READ ALSO  Gutta Sukhender Reddy | ఉచిత ప‌థ‌కాల‌ను నియంత్రించాలి.. నేత‌లు భాష మార్చుకోవాల‌న్న మండ‌లి ఛైర్మన్​

    Latest articles

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. భారీ గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి. గురువారం సెషన్‌లో యూఎస్‌,...

    Today Gold Price | కాస్త శాంతించిన బంగారం ధ‌ర‌లు.. ఇదే మంచి తరుణం!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : గ‌త కొద్ది రోజులుగా బంగారం Gold ధ‌ర‌లు ప‌రుగులు పెడుతుండ‌టం...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 25 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    More like this