అక్షరటుడే, వెబ్డెస్క్: Sigachi Blast | పాశమైలారం సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ పేలి అనేక మంది కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా పోలీసులు ఫ్యాక్టరీ సీఈవో అమిత్ రాజ్ (Sigachi Industries CEO Amit Raj) సిన్హాను అరెస్ట్ చేశారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని పారిశ్రామిక వాడలో గల సిగాచీ ఫ్యాక్టరీలో (Sigachi factory) జూన్ 30న ఉదయం పేలుడు చోటు చేసుకుంది. రియాక్టర్ పేలడంతో పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. ఆ సమయంలో పరిశ్రమలో 143 మంది కార్మికులు ఉన్నారు. ప్రమాదంలో 54 మంది చనిపోయారు. పేలుడు ధాటికి మృతదేహాలు గుర్తు పట్టనలేనంతగా మారిపోయాయి. దీంతో డీఎన్ఏ పరీక్షలు (DNA tests) చేసి కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించారు. 54 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. అయితే అందులో 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు.
Sigachi Blast | యాజమాన్యంపై కేసు
సిగాచీ పేలుడు (Sigachi explosion) ఘటనపై యాజమాన్యంపై కేసు నమోదు అయింది. నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ తెలిపింది. ఈ కేసు విషయంలో హైకోర్టు గతంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు కమిటీ చెప్పినా.. నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది. ఈ క్రమంలో తాజాగా సిగాచి పరిశ్రమ సీఈవో అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతగు ఏ2గా ఉన్నారు. ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.