అక్షరటుడే, వెబ్‌డెస్క్: Siddipet Medical College | సిద్దిపేట Siddipet జిల్లా మెడికల్ కాలేజీ Medical College లో విషాదం చోటుచేసుకుంది. ఓ జూనియర్ డాక్టర్ పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన తోటి విద్యార్థులు చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూసింది. కాగా, వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసుల విచారణలో తేలింది.
Siddipet Medical College | అసలేం జరిగిందంటే..
జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన లావణ్య సిద్దిపేట వైద్య కళాశాలలో 2020 బ్యాచ్ విద్యార్థిని. హౌస్ సర్జన్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సిద్దిపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. శుక్రవారం ఉదయం లేబర్ డ్యూటీలో ఉన్న టైంలో లావణ్య అస్వస్థతకు గురైంది. దీంతో సాధారణ ట్రీట్మెంట్ తీసుకుని కాలేజీ హాస్టల్‌కు వెళ్లిపోయింది. కాగా, హాస్టల్‌లోనే శనివారం ఉదయం గడ్డి మందును ఇంజెక్ట్ చేసుకుంది.
గమనించిన తోటి జూనియర్ వైద్యులు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. పరిస్థితి క్రిటికల్‌గా ఉండటంతో హైదరాబాద్‌లోని నిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది.
సిద్దిపేట మెడికల్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమని పోలీసులు తేల్చారు. లావణ్య ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ ప్రణయ్‌ని సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. లావణ్య, ప్రణయ్ తేజ్ ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా, లావణ్యది వేరే కులం కావడంతో ఆ సాకుతో పెళ్లికి ప్రణయ్ అడ్డుచెప్పాడు. లావణ్య మనస్తాపంతో పాయిజన్ ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.