More
    HomeసినిమాSiddhu Jonnalagadda | సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చిన హీరో సిద్ధు జొన్నలగడ్డ.. కొత్త అకౌంట్‌తో...

    Siddhu Jonnalagadda | సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చిన హీరో సిద్ధు జొన్నలగడ్డ.. కొత్త అకౌంట్‌తో మళ్లీ యాక్టివ్!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Siddhu Jonnalagadda | టాలీవుడ్ యువహీరో సిద్ధు జొన్నలగడ్డ మరోసారి సోషల్ మీడియాలో సందడి చేయడానికి రెడీ అయ్యాడు. కొంతకాలంగా ట్విట్టర్ (ఇప్పుడు X) నుంచి పూర్తిగా దూరంగా ఉన్న ఆయన, ఇప్పుడు కొత్త అకౌంట్‌తో మళ్లీ యాక్టివ్ అయ్యాడు.

    కొన్ని నెలలుగా సోషల్ మీడియాకు (Social Media) గుడ్‌బై చెప్పిన సిద్ధు, తన అభిమానులను, ఫాలోవర్లకు ఎలాంటి హింట్స్ ఇవ్వ‌కుండా స‌డెన్ షాక్ ఇచ్చాడు. త‌న కొత్త సినిమాకు సంబంధించి వీడియోను షేర్ చేస్తూ.. అక్టోబ‌ర్ 17న థియేట‌ర్‌లో క‌లుద్దాం అని కామెంట్ పెట్టాడు. ప్ర‌స్తుతం సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెలుసు క‌దా అనే చిత్రం రూపొందుతుంది.

    Siddhu Jonnalagadda | రీ ఎంట్రీ..

    నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తెలుసు కదా’ సినిమాలో (Telusu Kada Movie) శ్రీనిధి శెట్టి, రాశిఖన్నా హీరోయిన్స్​గా నటిస్తున్నారు. ఇటీవ‌ల టీజ‌ర్ విడుద‌ల కాగా, దానికి మంచి రెస్పాండ్ వ‌చ్చింది. టీజర్ చూశాక ఈ చిత్రంలో సిద్ధూ ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ గట్టిగానే చేయబోతున్నాడని ముచ్చ‌టించుకుంటున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా కొత్తగా ఈ సినిమా ఉండనుండ‌గా.. అక్టోబ‌ర్ 17న చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. ఇక ఇదిలా ఉంటే సిద్ధు ట్విట్టర్ నుంచి ఎందుకు వెళ్లిపోయాడు అన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. అయితే వ్యక్తిగత కారణాలు, కెరీర్‌లో వచ్చే ఒత్తిళ్లు, లేదా సోషల్ మీడియా నెగటివిటీ కారణమై ఉండవచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

    2022లో వచ్చిన ‘DJ టిల్లు’ మూవీతో సిద్దు సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఆయ‌న సినిమాపై ఫోకస్ పెంచడం కోస‌మే ట్విట్ట‌ర్‌కు దూరం ఉన్నాడేమో అన్న ఊహాగానాలు అప్పట్లో వినిపించాయి. సిద్ధు మళ్లీ ట్విట్టర్‌లోకి రావడంతో ఆయన అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. “Waiting for DJ Tillu 2”, “Welcome back Siddu Anna”, “#TilluIsBack” లాంటి హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. కొందరు నెటిజన్లు అయితే, “ఒక చెయ్యి మీద ఫోన్ పట్టుకుని ఇంకో చెయ్యితో ట్వీట్ చేసాడేమో!” అంటూ టిల్లు స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు.

    More like this

    Job Mela | కామరెడ్డిలో నిరుద్యోగులకు జాబ్​మేళా

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Job Mela | కామారెడ్డి జిల్లాలో (Kamareddy district) నిరుద్యోగ యువతకు ప్రైవేట్​ రంగంలో ఉద్యోగావకాశాలు...

    Private School | ప్రైవేట్​ పాఠశాలలో దారుణం.. విద్యార్థిని తల పగిలేలా కొట్టిన టీచర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Private School | ఓపికగా ఉండి విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాల్సిన కొందరు టీచర్లు (Teachers)...

    Yellareddy mandal | పీఎం ఆవాస్ యోజన లబ్ధిదారుల సర్వే

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy mandal | ఎల్లారెడ్డి మండలంలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకంలో (Pradhan Mantri...