అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | భిక్కనూరు (Bhiknoor) సిద్ధరామేశ్వర ఆలయం చాలా మహిమలు కలదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. సిద్ధరామేశ్వర ఆలయ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
ఎంపీ సురేష్ షెట్కార్తో(MP Suresh Shetkar) కలిసి ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన పాలకవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిద్ధరామేశ్వర ఆలయం (Siddharameshwara Temple) ద్వారానే భిక్కనూరు గ్రామానికి దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు.
ఈ ఆలయం కామారెడ్డి నియోజకవర్గంలో ఉండడం తన అదృష్టమని తెలిపారు. నూతన పాలకవర్గం ఆలయ అభివృద్ధికి పాటు పడాలని సూచించారు. ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు.