అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Amberpet SI | ఆన్లైన్ బెట్టింగ్ (Online Betting)పై చర్యలు తీసుకోవాల్సిన ఓ ఎస్సై దానికి బానిసగా మారాడు. ప్రజలకు అవగాహన కల్పించాల్సింది పోయి తానే బెట్టింగ్‌లు పెట్టాడు. అనంతరం అప్పుల పాలు కావడంతో అక్రమాలకు పాల్పడ్డాడు.
హైదరాబాద్ నగరంలోని అంబర్పేట్ పోలీస్ స్టేషన్ (Amberpet Police Station)లో భాను ప్రకాశ్ ఎస్సైగా పని చేస్తున్నాడు. బెట్టింగ్‌ల బారిన పడి అప్పుల పాలు అయ్యాడు. అనంతరం ఆ అప్పులు తీర్చేందుకు అడ్డదారులు తొక్కాడు. ఓ కేసులో రికవరీ చేసిన ఐదు తులాల బంగారాన్ని సొంతానికి వాడుకున్నాడు. అంతేగాకుండా సదరు ఎస్సై గన్ కూడా కనిపించకుండా పోయింది. దీనిపై ఆరా తీయగా.. గన్ను తాకట్టు పెట్టినట్లు తెలిసింది.
Amberpet SI | సిబ్బంది గుర్తించడంతో..
పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చోరీ కేసులో రికవరీ చేసిన బంగారంతో పాటు ఎస్సై భాను ప్రకాశ్ (SI Bhanu Prakash) తుపాకీ మిస్సయినట్లుగా సిబ్బంది గుర్తించారు. ఈ విషయాన్ని వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు విచారణ చేపట్టగా ఎస్సై ఎలాంటి సమాధానం చెప్పలేదు. అయితే ఎస్సై భాను ప్రకాశ్ బంగారంతో పాటు తన గన్ను సైతం పాన్ బ్రోకర్ షాపులో తాకట్టు పెట్టినట్లు సమాచారం. అప్పుల పాలు కావడంతో ఇలా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఉన్నతాధికారులు ఎస్సైని సస్పెండ్ చేశారు. గన్ అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు (Task Force Police) అతడిని విచారిస్తున్నారు.