అక్షరటుడే, ఇందూరు: SI Transfers | నిజామాబాద్ కమిషనరేట్ Nizamabad Commissionerate పరిధిలో పలువురు ఎస్సైలు స్థాన చలనం పొందారు.
ఆయా పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్సైలను బదిలీ చేస్తూ శుక్రవారం (నవంబరు 21) నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య Nizamabad Police Commissioner Sai Chaitanya ఉత్తర్వులు జారీ చేశారు.
SI Transfers | ఎవరెవరు అంటే..
- నిజామాబాద్ మూడో ఠాణాలో విధులు నిర్వర్తిస్తున్న కలమడుగు కిరణ్ పాల్‌ను ముప్కాల్ పీఎస్ ఎస్సైగా బదిలీ చేశారు.
- ముప్కాల్‌లో పనిచేసే రజనీకాంత్ వంగర.. ఆర్మూర్ ఠాణా ఎస్సై–1గా బదిలీ అయ్యారు.
- నగరంలోని ఒకటో ఠాణాలో విధులు నిర్వర్తించే ఎండీ షరీఫ్ను నిజామాబాద్ రూరల్ పీఎస్ ఎస్సై–1గా బదిలీ చేశారు.
- రూరల్ ఠాణాలో పని చేసే మహ్మద్ ఆరిఫ్‌ను వీఆర్‌కు అటాచ్ చేశారు.
- వీఆర్‌లో ఉన్న గంగుల మహేష్‌ను జక్రాన్‌పల్లి ఎస్‌హెచ్‌వోగా ట్రాన్స్ఫర్ చేశారు.
- జక్రాన్‌పల్లి పీఎస్ ఎస్‌హెచ్‌వో ఎండీ మాలిక్ రహమాన్‌ను వీఆర్‌కు అటాచ్ చేశారు.
బదిలీ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని సీపీ స్పష్టం చేశారు. బదిలీ అయిన పోలీసు అధికారులు వెంటనే తమకు కేటాయించిన చోట రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

