- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిSi transfers | పలువురు ఎస్సైల బదిలీ

Si transfers | పలువురు ఎస్సైల బదిలీ

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Si transfers | కామారెడ్డి జిల్లాలో శనివారం పలువురు ఎస్సైలను బదిలీ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంతకాలంగా వీఆర్​లో ఉన్న పోలీసులకు ఎట్టకేలకు పోస్టింగ్ లభించింది.

వీఆర్​లో ఉన్న ఎస్సై మహేందర్​ను బీర్కూర్​ బదిలీ చేశారు. ప్రకాశ్​ను బాన్సువాడ టౌన్​కు పంపించారు. వీకే రాములుకు బాన్సువాడ టౌన్​కు పోస్టింగ్ ఇచ్చారు. బీర్కూర్​లో పని చేస్తున్న రాజశేఖర్​ను కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్​కు బదిలీ చేశారు. కామారెడ్డి కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న రాజయ్యను డీఏఆర్​కు అటాచ్ చేశారు. డీఏఆర్​లో ఉన్న దత్తాద్రి గౌడ్​ను దేవునిపల్లికి బదిలీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. కాగా.. నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో తొమ్మిది ఎస్సైలను సైతం బదిలీ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News