అక్షరటుడే, వెబ్డెస్క్ : SI Suspended | నిందితులకు సహకరించిన ఓ ఎస్సైపై అధికారులు చర్యలు తీసుకున్నారు. విచారణ చేపట్టి సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్లోని గుంటూరు (Guntur)లో చోటు చేసుకుంది.
చిలకలూరిపేట (Chilakulurupeta) అర్బన్ ఎస్సై రహ్మతుల్లాపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు మృతి చెందారు. ఈ ఘటనకు ఓ ఏఎస్సై కుమారుడు కారణం కాగా.. అతడికి ఎస్సై రహ్మతుల్లా సహకరించినట్టు తేలడంతో ఎస్పీ చర్యలు తీసుకున్నారు. ఏఎస్సై కుమారుడు, ముఠా అక్రమ వసూళ్లకు అండగా ఉన్నట్లు రహ్మతుల్లాపై ఆరోపణలు ఉన్నాయి. ముఠా నుంచి ఎస్సై నాలుగు కార్లు తీసుకున్నట్లు గుర్తించారు.
SI Suspended | అసలు ఏం జరిగిందంటే..
చిలకలూరిపేటలో ఏఎస్సై కుమారుడు వెంకట నాయుడు సహా ఐదుగురు నిందితులు కలిపి ముఠాగా ఏర్పడ్డారు. వీరు రవాణా శాఖ అధికారుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో వీరు ఇటీవల చిలకలూరిపేట మండలం గణపవరం వద్ద తనిఖీల పేరుతో ఓ ట్రాక్టర్ కంటైనర్ను ఆపారు. వెనక నుంచి వస్తున్న కారు ఆ కంటైనర్ను ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ కేసులో నిందితులను గతంలోనే అరెస్ట్ చేశారు. అయితే వారికి ఎస్సై రహ్మతుల్ల సహకరించినట్ల తేలడంతో తాజాగా ఆయనపై వేటు వేశారు. కాగా.. ఈ కేసులో ఏఎస్సై కుమారుడు వెంకటనాయుడు ప్రధాన నిందితుడు. అతడిపై గతంలో సైతం అనేక ఆరోపణలు ఉన్నాయి. 2023లో తక్కువ ధరకు బంగారం పేరిట పలువురుని మోసం చేశాడు. గ్యాంగ్ ఏర్పాటు చేసుకొని గంజాయి దందా సైతం చేస్తున్నట్లు సమాచారం. కాగా వెంటకనాయుడు తండ్రి నర్సారావుపేట డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్సైగా పని చేస్తున్నాడు.