అక్షరటుడే, భీమ్గల్: SI Sandeep | వాహనదారులు, వీధి వ్యాపారులు ట్రాఫిక్ నిబంధనలు (Traffic rules) తప్పనిసరిగా పాటించాలని భీమ్గల్ (Bheemgal) ఎస్సై సందీప్ అన్నారు. భీమ్గల్ పోలీస్ స్టేషన్ (Bheemgal Police station) పరిధిలో ఉన్న ఆటోడ్రైవర్లు, ఆటో యూనియన్ సభ్యులు, పండ్లు, కూరగాయల వ్యాపారులను సోమవారం పిలిపించి ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు.
SI Sandeep | ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దు..
రోడ్లపై పాదచారులకు.. వాహనదారులకు తోపుడు బండ్ల కారణంగా ఎలాంటి ఇబ్బందులు రావొద్దని ఎస్సై వ్యాపారులకు వివరించారు. బస్టాండ్ (Bus stand) ప్రాంతంలో విపరీతమైన రద్దీ ఉంటోందని.. దీనికి తోడు వ్యాపారులు తమ బండ్లను రోడ్లపై ఉంచడం కారణంగా ఆర్టీసీ బస్సులకు కూడా ఇబ్బందిగా మారుతోందని ఆయన స్పష్టం చేశారు. ఆటోలు సైతం రోడ్లకు అడ్డంగా నిలుపుతున్నారని.. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎలాంటి పనులను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.