58
అక్షరటుడే, ఆర్మూర్: Panchayat Elections | మూడోవిడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) భాగంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఉదయం నుంచి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపించారు. యువత నుంచి వృద్ధుల వరకు ఓటు వేశారు. ఈ క్రమంలో ఆర్మూర్ మండలంలోని ఫత్తేపూర్ గ్రామంలో పోలింగ్ కేంద్రానికి ఓ వృద్ధురాలు ఓటు వేసేందుకు వచ్చింది.
Panchayat Elections | ఆర్మూర్ ఎస్సై రజనీకాంత్..
పోలింగ్ కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న ఆర్మూర్ ఎస్సై రజనీకాంత్ (Armoor SI Rajinikanth) స్పందించారు. ఆ వృద్ధురాలిని వీల్చైర్లో పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు. ఆమె ఓటు వేసిన అనంతరం బయటకు జాగ్రత్తగా తీసుకొచ్చారు. వృద్ధురాలికి సాయం అందించిన ఎస్సైని పలువురు అభినందించారు.