అక్షరటుడే, వెబ్‌డెస్క్: Film Nagar SI | రోడ్డు ప్రమాదంలో ఎస్సై దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన సిద్దిపేట (Siddipeta) జిల్లా చేర్యాల గేటు వద్ద బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఫిల్మ్‌నగర్ ఎస్సై రాజేశ్వర్ (Film Nagar SI Rajeswar) తీవ్రంగా గాయపడి మృతి చెందారు. సంగారెడ్డి (Sangareddy)లోని చాణక్యపురి కాలనీకి చెందిన రాజేశ్వర్ 1990లో పోలీస్ శాఖలో చేరారు. ప్రస్తుతం ఆయన ఫిల్మ్‌నగర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. వారం క్రితమే హైదరాబాద్‌లోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఆయన బాధ్యతలు చేపట్టారు.
నగరంలో బోనాల పండుగలో భాగంగా బల్కంపేట ఎల్లమ్మ (Balkampeta Ellamma) ఉత్సవాల్లో ఎస్సై రాజేశ్వర్ బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. బుధవారం రాత్రి విధులు బందోబస్తు ముగించికొని ఇంటికి వెళ్తుండగా ఆయన కారు, లారీ పరస్పరం ఢీకొన్నాయి. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాజేశ్వర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.