అక్షరటుడే, వెబ్‌డెస్క్: ACB Raid | లంచం తీసుకుంటూ ఓ పోలీస్ అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. రూ.20 వేలు తీసుకుంటుండగా కొల్లూరు ఎస్సై రమేశ్‌ను (Kollur SI Ramesh) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అవినీతి అధికారులు మారడం లేదు. గతేడాది ఏసీబీ రికార్డు స్థాయిలో కేసులు నమోదు చేసింది. మొత్తం 199 కేసులు పెట్టింది. అనేక మంది అవినీతి అధికారులను అరెస్ట్ చేసింది. అయినా కూడా లంచాలకు మరిగిన అధికారులు మారడం లేదు. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సంగారెడ్డి జిల్లా (Sangareddy district) కొల్లూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు చేపట్టింది. ఓ కేసు నుంచి తప్పించేందుకు లారీ ఓనర్ నుంచి డబ్బులు డిమాండ్ చేసిన ఎస్సై రమేశ్‌ను పట్టుకుంది.
ACB Raid | రూ.30 వేల డిమాండ్
ఓ లారీ ఓనర్‌ను కేసు నుంచి తప్పించడానికి ఎస్సై రూ.30 వేల లంచం డిమాండ్ చేశాడు. గత నెల 17న రూ.5 వేలు తీసుకున్నాడు. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులకు (ACB officials) ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఫిర్యాదుదారుడి నుంచి పోలీస్ స్టేషన్లో రూ.20 వేలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు ఎస్సై రమేశ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో సోదాలు జరిపారు. ఎస్సై ఆస్తులపై సైతం వివరాలు సేకరించారు. నిందితుడిని హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు.
ACB Raid | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఏసీబీ వెబ్సైట్ (ACB Website) ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.
ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.