అక్షరటుడే, ఆర్మూర్: Mla Rakesh reddy | శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని (Shyama Prasad Mukherjee) సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి శ్యామాప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో 1951లో జాతీయ జన సంఘ్ పార్టీ ఏర్పాటు చేసి.. హిందుత్వాన్ని నలుదిశలా వ్యాప్తి చేశారన్నారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు బాలు, సీనియర్ నాయకులు నూతల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్, కలిగోట గంగాధర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొత్తూరు గంగాధర్, ప్రధాన కార్యదర్శులు గుగులోత్ తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Mla Rakesh reddy | ఆర్మూర్లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి
55