Homeఅంతర్జాతీయంShutdown effect | షట్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. రూ. 62 వేల కోట్లు ఆవిరి..

Shutdown effect | షట్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. రూ. 62 వేల కోట్లు ఆవిరి..

కీలక బిల్లులపై అమెరికా చట్టసభ సభ్యుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఆ దేశ సంపద కరిగిపోతోంది. అక్కడ ప్రభుత్వ షట్‌డౌన్‌ 31 రోజులుగా కొనసాగుతోంది. దీంతో అమెరికా సంపదలో సుమారు రూ. 62 వేల కోట్లపైగా సంపద ఆవిరైంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Shutdown effect | అమెరికా రాజకీయ నాయకుల (American politicians) మొండి వైఖరి ఆ దేశ ఆర్థిక వ్యవస్థనే తీవ్రంగా దెబ్బతీస్తోంది. కీలకమైన బిల్లుల విషయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరక ప్రభుత్వం షట్‌డౌన్‌లోకి వెళ్లి పోయిన విషయం తెలిసిందే. ఈ షట్‌డౌన్‌ ప్రారంభమై నెలరోజులు గడిచాయి. సుదీర్ఘ షట్‌డౌన్‌ అగ్రరాజ్యానికి భారీ నష్టాన్ని మిగులుస్తోంది.

తాజాగా కాంగ్రెషనల్‌ బడ్జెట్‌ ఆఫీస్‌ (Congressional Budget Office) విడుదల చేసిన అంచనాల ప్రకారం 31 రోజులలో అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి 7 బిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 62,149 కోట్ల సంపద ఆవిరయ్యింది. ఇదిలాగే కొనసాగితే మరింత భారీ నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి. ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందని.. ఈ షట్‌డౌన్‌ ఊహించిన దానికంటే పెద్ద సమస్యగా మారి ఆర్థిక వృద్ధిని మందగింపజేస్తుందని ఆర్థిక నిపుణులు (Economists)ఆందోళన వ్యక్తం చేశారు.

Shutdown effect | ఉద్యోగాలపై ఎఫెక్ట్‌!

షట్‌డౌన్‌ కారణంగా ప్రతివారం అమెరికా ఆర్థిక వృద్ధిలో (US economic growth) 0.1 నుంచి 0.2 పాయింట్లు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. షట్‌డౌన్‌ 6 వారాలు కొనసాగితే 11 బిలియన్‌ డాలర్లు.. 8 వారాలకు 14 బిలియన్‌ డాలర్ల మేర ఆర్థిక నష్టం ఏర్పడుతుందని సీబీవో(CBO) హెచ్చరించింది. ఇది ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్న అభిప్రాయాన్ని ఆర్థిక వేత్తలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక, విధానపరమైన అనిశ్చితి కారణంగా పలు సంస్థలు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI), ఆటోమేషన్‌లతో జాబ్‌ మార్కెట్‌లో ఇప్పటికే బలహీనత కనిపిస్తోంది. ప్రభుత్వ షట్‌డౌన్‌ ఉద్యోగాల కోతలను మరింత పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Shutdown effect | ట్రంప్‌ హయాంలోనే రెండోసారి..

1981 నుంచి అమెరికా ప్రభుత్వం 15 సార్లు షట్‌డౌన్‌ను ఎదుర్కొంది. ట్రంప్‌ (Trump) హయాంలో ఇది రెండోసారి. అమెరికా చట్టసభ సభ్యుల్లో రాజీ సూచనలు కనిపించకపోవడంతో 2018-19లో డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలోనే 35 రోజులపాటు షట్‌ డౌన్‌ కొనసాగింది. ఆ దేశ చరిత్రలో ఇదే సుదీర్ఘమైన షట్‌డౌన్‌. ఈసారి ఆ రికార్డును ట్రంప్‌ సర్కార్‌ తిరగరాసే అవకాశాలున్నాయి.