Homeఅంతర్జాతీయంAmerica Shutdown | అమెరికాలో షట్​డౌన్ ఎఫెక్ట్.. విమాన సర్వీసులకు అంతరాయం

America Shutdown | అమెరికాలో షట్​డౌన్ ఎఫెక్ట్.. విమాన సర్వీసులకు అంతరాయం

అమెరికాలో షట్​డౌన్​ కారణంగా ఎయిర్​ ట్రాఫిక్​ సిబ్బంది విధులకు హాజరు కావడం లేదు. దీంతో వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : America Shutdown | అగ్రరాజ్యం అమెరికాలో ప్రభుత్వం షట్​డౌన్​ కొనసాగుతోంది. దీంతో ఆ దేశంలో ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అమెరికాలో రెండు బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో ప్రభుత్వం షట్​డౌన్ (America Shutdown) అయిన విషయం తెలిసిందే. అమెరికా తర్వాతి ఆర్థిక సంవత్సరానికి అవసరమైన నిధుల బిల్లులను సెనెట్​ ఆమోదించలేదు. దీంతో అక్టోబర్​ 1 నుంచి షట్​డౌన్ కొనసాగుతోంది. దీని ప్రభావంతో అగ్రరాజ్యంలో ఆదివారం దాదాపు 8 వేల విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. దేశంలోని 22 చోట్ల ఎయిర్ ట్రాఫిక్ సమస్యలు (Traffic Problems) నెలకొన్నాయి. షట్​డౌన్​ కారణంగా ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోల్​ సిబ్బంది విధులకు హాజరు కాలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

America Shutdown | 26 రోజులుగా..

అగ్రరాజ్యంలో 26 రోజులుగా షట్​డౌన్​ కొనసాగుతోంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ 22 ప్రదేశాలలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది సమస్యలను ఎదుర్కొందని, రాబోయే రోజుల్లో అదనపు కొరత కారణంగా మరిన్ని విమానాల ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అమెరికా రవాణా కార్యదర్శి సీన్ డఫీ (US Transportation Secretary Sean Duffy) అన్నారు. షట్​డౌన్​ ప్రారంభం అయిన నాటి నుంచి విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. రాబోయే రోజుల్లో పలు విమానాలు రద్దు అయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. షట్​డౌన్​ కారణంగా ఉద్యోగులకు జీతాలు చెల్లింపులు జరగడం లేదు. జీతాలు లేకుండా దాదాపు 13 వేల మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, 50 వేల మంది ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ అధికారులు పనిచేయాల్సి ఉంటుంది. వారు విధులకు రాకపోవడంతో సమస్య నెలకొంటుంది.

America Shutdown | నిలిచిపోనున్న ‘స్నాప్’​

షట్​డౌన్​ కారణంగా సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (SNAP) ప్రయోజనాలను నవంబర్ 1న జారీ చేయబోమని వ్యవసాయ శాఖ వెబ్‌సైట్‌లో పేర్కొంది. “ఫుడ్ స్టాంపులు” అని పిలువబడే SNAP దాదాపు 42 మిలియన్ల తక్కువ-ఆదాయ అమెరికన్లకు సేవలు అందిస్తుంది. అయితే షట్​డౌన్​ ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియడం లేదు. గతంలో ట్రంప్​ (Donald Trump) అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2019లో 35 రోజులు షట్​డౌన్​ కొనసాగింది. ప్రస్తుతం ఇప్పటికే 26 రోజులు అవుతోంది. దీంతో అప్పటి కంటే ఎక్కువ రోజులు షట్​ డౌన్​ ఉంటుందా.. లేక ప్రభుత్వం ఎమైనా చర్యలు చేపడుతుందా చూడాలి.