Homeక్రీడలుIND vs ENG | బ‌య‌ట పిల్లి అంటూ గిల్‌పై విమ‌ర్శ‌లు.. స‌త్తా ఏంటో చూపించాడుగా..!

IND vs ENG | బ‌య‌ట పిల్లి అంటూ గిల్‌పై విమ‌ర్శ‌లు.. స‌త్తా ఏంటో చూపించాడుగా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: IND vs ENG | ప్ర‌స్తుతం టీమిండియా ఇంగ్లండ్ (England) ప‌ర్య‌ట‌న‌తో బిజీగా ఉంది. ఐదు టెస్ట్‌ల్లో భాగంగా తొలి టెస్ట్ లార్డ్స్ లో నిన్న‌టి నుండి జ‌రుగుతుంది. అయితే ఇంగ్లండ్ పర్యటనను భారత బ్యాటర్లు(Indian batters) ఘనంగా ప్రారంభించారు. శుక్రవారం లీడ్స్ వేదికగా ప్రారంభమైన తొలి మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(159 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 101), శుభ్‌మన్ గిల్(175 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 127 బ్యాటింగ్) సెంచరీలతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 3 వికెట్లకు 359 పరుగుల భారీ స్కోర్ చేసింది. రిషభ్ పంత్(102 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 65 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్(78 బంతుల్లో 8 ఫోర్లతో 42) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

IND vs ENG | చెడుగుడు ఆడారు..

అయితే కొత్త కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ (Shubman Gill) విదేశాల‌లో స‌రిగా ఆడ‌లేడు అనే అప‌వాదుని ఎప్ప‌టినుండో మోస్తున్నాడు. దానికి ఇంగ్లండ్ వేదిక‌గా గ‌ట్టి బ‌దులు ఇచ్చాడు. లీడ్స్ టెస్ట్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. దీంతో పాటు, అతను కొన్ని ప్రత్యేక రికార్డులను కూడా సృష్టించాడు. ఆసియా వెలుపల టెస్ట్ మ్యాచ్‌(Test Match)లో గిల్ సెంచరీ చేయడం ఇదే తొలిసారి. విదేశాల్లో ఇది అతనికి రెండో సెంచరీ మాత్రమే. అంతకుముందు బంగ్లాదేశ్‌లో సెంచరీ చేశాడు. అతని టెస్ట్ కెరీర్‌లో ఆరో సెంచరీ. టెస్ట్ కెప్టెన్సీలో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన భారత కెప్టెన్‌(Indian captain)గా గిల్ ఇప్పుడు నిలిచాడు. కేవలం 25 సంవత్సరాల 285 రోజుల వయసులో గిల్ తన కెప్టెన్సీలో తొలి మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు.

ఈ విధంగా, అతను విరాట్ కోహ్లీ(Virat Kohli) (26 సంవత్సరాలు, 34 రోజులు) రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో అరంగేట్ర ప్లేయర్ సాయి సుదర్శన్(0) ఒక్కడే నిరాశపర్చాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ రెండు వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్ ఓ వికెట్ పడగొట్టాడు. తొలి రోజు ఆటలో భారత జట్టే పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మూడు సెషన్ల పాటు ఇంగ్లండ్ బౌలర్లను(England bowlers) భారత బ్యాటర్లు చెడుగుడు ఆడారు. మూడో సెషన్ ప్రారంభంలోనే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. జైస్వాల్‌ను స్టోక్స్ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 129 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రిషభ్ పంత్ (Rishabh Pant) వచ్చి రావడంతోనే తన ట్రేడ్ మార్క్ బౌండరీతో స్టోక్స్‌ను బెంబేలెత్తించాడు. మరోవైపు గిల్ తనదైన షాట్లతో విరుచుకుపడ్డాడు. పంత్ కాస్త స్లోగా ఆడినా గిల్.. వేగంగా పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను 140 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ కాసేపటికే పంత్ కూడా 91 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం దూకుడుగా ఆడిన పంత్ రెండు భారీ సిక్సర్లు కొట్టాడు.