అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Shubman Gill | టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇటీవల కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో మెడ నొప్పితో బాధపడిన విషయం తెలిసిందే. ఆటలో మూడు బంతులు ఆడిన తర్వాత మెడ నొప్పి తీవ్రత పెరగడంతో గిల్ సాయం కోరుతూ మైదానం వదిలి ఆసుపత్రికి వెళ్లాడు.
నొప్పి తీవ్రత ఎక్కువ ఉండడంతో గిల్‌ను ఉడ్ ల్యాండ్స్ ఆసుపత్రి (Wood Lands Hospital)లోని ఐసీయూలో చికిత్స అందించారు. చికిత్స తర్వాత ఆదివారం రాత్రి ఆయన డిశ్చార్జ్ అయ్యారు.అయితే టీమిండియా (Team India) బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ గిల్ గాయంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి.
Shubman Gill | ఏది నిజం..
శుభ్‌మన్ (Shubman Gill) నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నాడు, అందుకే మెడ కండరాలు పట్టేసినట్టు ఉంది,” అని మోర్కెల్ పేర్కొన్నారు. ఈ సమస్య నుండి ఆయన త్వరలో కోలుకోవచ్చునని కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యలు అభిమానులలో అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. శుభ్‌మన్ గిల్ కు నిజంగా నిద్రలేమి సమస్య ఉందా?, అది డిప్రెషన్‌కు సంకేతమా?, చిన్న వయసులో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న తీరు అతనిపై భారంగా మారిందా అని చర్చిస్తున్నారు. మరి కొందరు సారా టెండూల్కర్, గిల్ మధ్య ఏమైనా విభేదాలా?” అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మరోవైపు కోచ్ గంభీర్ నుండి ఒత్తిడి పెరిగిందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గిల్ తన కెప్టెన్సీ పయనాన్ని విజయవంతంగా ప్రారంభించాడు, కానీ ఇప్పుడు ఈ ఆరోగ్య సమస్యలు , అతని మానసిక స్థితిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అతను త్వరలోనే క్రికెట్‌లోకి స్ట్రాంగ్‌గా తిరిగి రాగలడా? ముఖ్యంగా,ఇలాంటి ఒత్తిడి సమయంలో జట్టుని ఎలా నడిపిస్తాడో అని అభిమానులు చర్చిస్తున్నారు. రోహిత్ శర్మ తర్వాత ఇటు వన్డే, అటు టెస్ట్ జట్టుకి శుభ్‌మన్ గిల్‌ని కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. టీ20లకి సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఉన్నాడు.
